సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ గా ‘సర్కారు వారి పాట’.. 50 రోజులు పూర్తి చేస్తుకున్నయాక్షన్ ఫిల్మ్..

Published : Jun 30, 2022, 04:06 PM IST
సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ గా ‘సర్కారు వారి పాట’.. 50 రోజులు పూర్తి చేస్తుకున్నయాక్షన్ ఫిల్మ్..

సారాంశం

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ జరిపాయి.  

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu), కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన తొలి రోజు కాస్తా నెగెటివ్ టాక్ వచ్చినా.. తర్వాతి రోజుల్లో పాజిటివ్ టాక్ తో బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచింది. మరోవైపు బాక్సాఫీస్ కలెక్షన్స్ లోనూ Sarkaru Vaari Paata తన మార్క్ చూపించింది. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ పరుశు రామ్ పెట్ల దర్శకత్వం వహించారు. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అద్భుతమైన సంగీతం అందించారు.

అయితే, తాజాగా ఈ చిత్రం 50వ రోజును పూర్తి చేసుకుంది. సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ గా చిత్రం గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని తాజాాగా చిత్ర మేకర్స్ ప్రకటించారు. సోషల్ మేసెజ్ తో పాటు కమర్షియల్ టచ్ తో సూపర్ స్టార్ సినిమాలు వస్తుండటం.. అదే తరహాలో ‘సర్కారు వారి పాట’ ఉండటంతో మహేశ్ బాబు అభిమానులు ఖుషీ అయ్యారు. సినిమా 50 రోజులు  పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ కూడా సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. మరోవైపు అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యంగా సర్కారు వారి పాటలో బ్యాంకింగ్ రంగంలో జరిగే దోపిడీలతో సామాన్య ప్రజలపై పడే ప్రభావాన్ని ఎత్తిచూపడంలో దర్శకుడు పరశురామ్ పెట్ల సఫలమయ్యాడు. అలాగే మహేశ్ బాబును సరికొత్తగానూ చూపించారు. మహేశ్ బాబు, కీర్తి సురేశ్ మధ్య సాగే లవ్ ట్రాక్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఈ చిత్రంలోని పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ప్రధానంగా ‘కళావతి’, ‘సర్కారు వారి పాట’, ‘మ మ మహేశా’ సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. 

ఈ చిత్రం తర్వాత మహేశ్ బాబు భారీ చిత్రాల్లో నటించనున్నారు. 11 ఏండ్ల తర్వాత మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘ఎస్ఎస్ఎంబీ 28’లో నటిస్తున్నారు. అలాగే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎస్ఎస్ఎంబీ 29’ని కూడా లైన్ లో పెట్టారు. ఈ రెండు చిత్రాలు మహేశ్ కేరీర్ లోనే పెద్ద చిత్రాలుగా నిలవబోతున్నాయి. అభిమానులు కూడా ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ హాలీడేలో ఉన్న మహేశ్ బాబు తిరిగి రాగానే త్రివిక్రమ్ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు టాక్. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌