'దసరా' డైరక్టర్ నెక్ట్స్ సినిమా ఫిక్స్..హీరో ఎవరంటే..

Published : Apr 03, 2023, 04:15 PM IST
    'దసరా'  డైరక్టర్ నెక్ట్స్ సినిమా ఫిక్స్..హీరో ఎవరంటే..

సారాంశం

ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా పరిచయం అయ్యాడు.  ఇప్పుడీ దర్శకుడు ఇండస్ట్రీలో హాట్ ప్రాపర్టీగా మారారు. 


దసరా ఫస్ట్ లుక్ వచ్చిన నాటి నుంచీ ఆ సినిమాకు యూత్ లో క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత దసరా టీజర్, ట్రైలర్ తో నెక్ట్స్ లెవిలి కు తీసుకెళ్లి ఓ రేంజి ఓపెనింగ్స్ తెచ్చుకుని దుమ్ము దులిపారు.    మాస్ ఆడియన్స్ లోకి వెళ్లే  అవకాశం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న నానికి ఈ సినిమా ప్లస్ అయ్యింది. ఓ రేంజిల కలెక్షన్స్ అన్ని చోట్లా అదరకొడుతున్నారు.  లుక్ పరంగా .. యాస పరంగా .. కథా పరంగా ఈ సినిమా నానిలోని మాస్ హీరోను తట్టి లేపింది. మాస్ రోల్ ను నాని ఈ స్థాయిలో చేస్తాడని ఎవరూ ఊహించలేదు కూడా. అంతగా ఆయన ధరణి అనే పాత్రలో ఇమిడిపోయాడు.తెలంగాణలో ని సింగరేణి గనుల నేపథ్యంలో వీర్లపల్లి అనే గ్రామంలో జరిగే ఒక కథగా ఈ సినిమాని రూపొందించారు.

క్రితం నెల 30వ తేదీన విడుదలైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలి రోజునే 38 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. రెండో రోజుతో కలుపుకుంటే 53 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. చూస్తుంటే ఈ వీకెండ్ లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా పరిచయం అయ్యాడు.  ఇప్పుడీ దర్శకుడు ఇండస్ట్రీలో హాట్ ప్రాపర్టీగా మారారు. 

శ్రీకాంత్ ఓదెల వర్క్ ని సినిమా చూసిన సాధారణ ప్రేక్షకుల మొదలు సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తర్వాత సినిమా ఎవరితో ఉండబోతుందనే అంశం మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు శ్రీకాంత్ ఓదెల తదుపరి చిత్రం అక్కినేని అఖిల్ తో ఉండే అవకాశం ఉంది. అఖిల్ కు ఇప్పటికే ఓ కథ చెప్పారని సమాచారం. ప్రస్తుతానికి శ్రీకాంత్ ఓదెల దసరా సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే అఖిల్ కు చెప్పిన కథ ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ బ్యానర్ పై ఈ సినిమా చేసే అవకాసం ఉందని సమాచారం.

 ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అఖిల్ ప్రస్తుతానికి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఈనెల 28వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ రిలీజ్ కు సంబంధించిన ఎలాంటి హడావుడి కనిపించడం లేదు.  అఖిల్ ఏజెంట్  నుంచి బయటపడగానే శ్రీకాంత్ ఓదెల సినిమాకి సంబంధించిన పూర్తిస్థాయిలో ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ