నయనతార పిల్లల పూర్తి పేర్లు ఇవే.. ఫైనల్ గా రివీల్ చేసిన లేడీ సూపర్ స్టార్..

By Asianet News  |  First Published Apr 3, 2023, 3:19 PM IST

కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్ - నయనతార  ట్విన్స్ కు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అయితే కవలలకు పెట్టిన పూర్తి పేర్లను తాజాగా రివీల్ చేసింది. 
 


కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార  (Nayanthara) - విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) కొన్నేండ్ల ప్రేమాయణం తర్వాత గతేడాది పెళ్లి  పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. 2022 జూన్ 09న నయన్ - విఘ్నేష్ పెళ్లి  మహాబలిపురంలో ఘనంగా జరిగిన  విషయం తెలిసిందే. ఇక అదే ఏడాది అక్టోబర్ లో ఇద్దరు పిల్లలు జన్మించారని.. అందులోనూ కవలలు పుట్టారని సడెన్ గా అనౌన్స్ చేశారు. అయితే వారికి ఇద్దరు బేబీ బాయ్స్ జన్మించారని ప్రకటించారు.

సరోగసీ ద్వారా ట్విన్స్ కు జన్మినిచ్చి తల్లిదండ్రులైన నయన్ - విఘ్నేష్ శివన్ వారి పిల్లలకు అప్పుడే పేరు పెట్టారు. ఉయిర్, ఉలగ్ అని నామకరణం  చేసినట్టు ప్రకటించారు.  కానీ అవిపూర్తి  పేర్లు కాదు.  తాజాగా నయనతారా కోలీవుడ్ లో రెండ్రోజుల  కింద జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ఎట్టకేళలకు తన  పిల్లల పూర్తి పేర్లను రివీల్ చేసింది. తన మొదటి కుమారుడి  పేరు ‘ఉయిర్ రుద్రోనిల్ ఎన్. శివన్’ అని తన  రెండవ కుమారుడి పేరు ‘ఉలగ్ ధైవాగ్ ఎన్. శివన్.’ అని చెప్పుకొచ్చారు. ఫైనల్ గా తన పిల్లల  పూర్తి పేర్లను చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

Latest Videos

నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్లి చెన్నైలోని మహాబలిపురంలో చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, తమిళ స్టార్ రజనీకాంత్ వంటి స్టార్లు హాజరయ్యారు. అంతేకాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హాజరై ఆశీర్వదించారు. సెలబ్రెటీలతో పాటు ప్రముఖ రాజకీయ వేత్తలు కూడా హాజరై సందడి చేశారు. 

మొత్తానికి పెళ్లి తర్వాత నయన్, విఘ్నేష్ ఇటు మ్యారీడ్ లైఫ్ లో అటు కేరీర్ లో ఫుల్ బిజీ అవుతున్నారు.  రీసెంట్ గా పిలలతో ఎయిర్ పోర్టులో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. నయనతార ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సరసన ‘జవాన్’లో  నటిస్తోంది.  విఘ్నేష్ కోలీవుడ్ లొ ప్రాజెక్ట్స్ ను సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

And finally, reveals her twin boys' names... 🥺❤

Uyir Rudronil N Shivan ❤
Ulag Dhaiveg N Shivan ❤ https://t.co/7g1tYhclCd pic.twitter.com/CCHFyFthUT

— N'cafe... (@NayanCafe)
click me!