దసరా మూవీ వీక్షించిన రాజమౌళి.. నాని, కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపించిన జక్కన్న

Published : Apr 03, 2023, 04:01 PM IST
దసరా మూవీ వీక్షించిన రాజమౌళి.. నాని, కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపించిన జక్కన్న

సారాంశం

నేచురల్ స్టార్ నాని చాలా రోజుల తర్వాత సరైన బాక్సాఫీస్ విజయం అందుకున్నాడు. దసరా చిత్రం నాని బాక్సాఫీస్ దాహాన్ని తీర్చింది అనే చెప్పాలి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ కథతో డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

నేచురల్ స్టార్ నాని చాలా రోజుల తర్వాత సరైన బాక్సాఫీస్ విజయం అందుకున్నాడు. దసరా చిత్రం నాని బాక్సాఫీస్ దాహాన్ని తీర్చింది అనే చెప్పాలి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ కథతో డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డెబ్యూ చిత్రంతోనే అద్భుతమైన కథని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయడంతో శ్రీకాంత్ ఓదెలపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. 

నాని, కీర్తి సురేష్ వైవిధ్యమైన పాత్రల్లో తన సత్తా చూపించారు. నాని ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించారు. ఫలితంగా దసరా చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 

తాజాగా దర్శకధీరుడు రాజమౌళి 'దసరా చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ట్విట్టర్ వేదికగా దసరా మూవీపై తన అభిప్రాయం తెలిపారు. ' రా నేచర్ తో కనిపించే పాత్రలు.. వైవిధ్యమైన పరిస్థితుల మధ్య శ్రీకాంత్ ఓదెల ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ చిత్రీకరించారు. నాని ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించాడు. ఇక కీర్తి సురేష్ తన పాత్రలో కేక్ వాక్ చేసినట్లే నటించింది. ఈ చిత్రంలో ప్రతి నటుడు పాత్ర గుర్తుండిపోయే విధంగానే ఉంది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ చాల బావున్నాయి. దసరా టీం మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. 

 

జక్కన్న అంతటి వాడు దసరా చిత్రానికి అద్భుతమైన రివ్యూ ఇవ్వడంతో నాని ఫాన్స్ గాల్లో తేలిపోతున్నారు. ఇక ఎస్ఎస్ కార్తికేయ కూడా ట్వీట్ చేస్తూ.. ఏం సినిమా తీసిర్రు బా**త్ . ఇచ్చి పడేసిర్రు. ఒక స్టార్ స్క్రిప్ట్ ని పూర్తిగా నమ్మితే తన భుజాలపై ఎలా మోస్తాడో అనేదానికి ఈ చిత్రం నిదర్శనం. ట్యాగ్స్ ఏమీ అవసరం లేదు అని పేర్కొన్నాడు. ఇప్పటికే దసరా చిత్రంపై మహేష్ బాబు, ప్రభాస్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ