
'బాహుబలి 2' పదిహేను వందల కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, భారతీయ సినిమా చరిత్రలో అతి పెద్ద గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికీ మంచి వసూళ్లే రాబట్టుకుంటున్నా... బాహుబలి రికార్డులకు ఇటీవలే చైనాలో విడుదలైన 'దంగల్' ప్రతి రోజూ మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలు చేస్తూ గండి కొడుతోంది.
ఇప్పటికే చైనాలో ఎనభై అయిదు మిలియన్ డాలర్లు కొల్ గొట్టి.. హాలీవుడ్ సినిమాలు మినహాయించి చైనాలో.. అత్యధిక వసూళ్లు సాధించిన పరదేశీ చిత్రంగా రికార్డులకెక్కింది. మరో రెండు, మూడు రోజుల్లో చైనాలో వంద మిలియన్ డాలర్ల మార్కుని దాటబోతోన్న దంగల్, ఒక్క చైనాలోనే వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే పధ్నాలుగు వందల కోట్ల గ్రాస్ వసూలు చేసిన దంగల్ చైనా వసూళ్లతో బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సాధించిన రికార్డుని చెరిపేస్తుంది. బిగ్గెస్ట్ ఇండియన్ హిట్ అనిపించుకున్న కొద్ది రోజులకే బాహుబలికి... ఎప్పుడో రిలీజ్ అయిన దంగల్ దూకుడు అడ్డుకట్ట వేసినట్లయింది.
అయితే భారత దేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా బాహుబలి 2 సాధించిన రికార్డుకి ఇప్పట్లో ప్రమాదమేమీ లేదు. కానీ బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ రిలీజైతే.. బాహుబలి 2 దేశవ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ రికార్డు కూడా చరిత్రలో కలిసిపపోయే అవకాశం ఉందని చెప్పవచ్చు.