మాస్ మహారాజా రవితేజ - యంగ్ బ్యూటీ శ్రీలీలా జంటగా నటిస్తున్న చిత్రం ‘ధమాకా’. మూవీ నుంచి తాజాగా మరో క్రేజీ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఊరమాస్ స్టెప్పులతో ఇద్దరూ దుమ్ములేపుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది.
టాలీవుడ్ లో వరుస చిత్రాలతో అలరిస్తున్నారు సీనియర్ హీరో, మాస్ మహారాజ రవితేజ (Raviteja). చివరిగా ‘రామారావు ఆన్ డ్యూటీ తో అలరించారు. అంతకు ముందు ‘ఖిలాడీ’తో ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘ధమాకా’(Dhamaka)తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ - యంగ్ బ్యూటీ శ్రీలీలా (Sree Leela) జంటగా నటిస్తున్నారు. ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఉన్నా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేళలకు డిసెంబర్ 23న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. కాగా తాజాగా మరో క్రేజీ సాంగ్ ను విడుదల చేశారు. ‘దండకడియాల్’ (Dandakadiyal) టైటిల్ తో లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. లేటెస్ట్ సాంగ్ కు అదిరిపోయే ట్యూన్ ను సమకూర్చారు. బీమ్స్, సాహితీ చాగంటి, మంగ్లీ అద్భుతంగా ఆలపించారు. మాస్ లిరిక్స్ కు రవితేజ, శ్రీలీలా ఊరమాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ కు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ దక్కుతోంది.
గతంలో ‘ధమాకా’ నుంచి నాలుగు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. లేటెస్ట్ అప్డేతో కలుపుకొని మొత్తం ఐదు పాటలను మేకర్స్ విడుదల చేశారు. రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండటంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. రవితేజను డిఫరెంట్ లుక్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు త్రినాధ రావు నక్కిన. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతలు. తనికెళ్ల భరణి, రావు రమేశ్, అలీ, హైపర్ ఆది, పవిత్రా లోకేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
A Mass Masth song to all of you from !
Here’s the Lyrical Video!
- https://t.co/nIANhlMP4V on DEC 15th :)) pic.twitter.com/9wVhG9jZUv