ఎన్టీఆర్ బయోపిక్: పెద్దల్లుడి పాత్రను ఎలా చూపిస్తారో?

By Prashanth MFirst Published Oct 23, 2018, 7:17 PM IST
Highlights

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై రోజుకో వార్త అంచనాలను రెట్టింపు చేస్తోంది. పోటీగా ఆర్జీవీ ఎంత హడావుడి చేసినా కూడా బాలకృష్ణ టీమ్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సినిమా క్రేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తోంది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై రోజుకో వార్త అంచనాలను రెట్టింపు చేస్తోంది. పోటీగా ఆర్జీవీ ఎంత హడావుడి చేసినా కూడా బాలకృష్ణ టీమ్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సినిమా క్రేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తోంది. సినిమాలో నటించే వారి పాత్రలకు సంబందించిన స్టిల్స్ రిలీజ్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. 

ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరా రావు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న ఆయన కూడా ఎన్టీఆర్ జీవితంలో ఒక కీలకమైన వ్యక్తి. ఆయన పాత్రలో భారత్ రెడ్డి కనిపించనున్నాడు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్బంగా ఫొటో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పాత్రను ఎంతవరకు చుపిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. 

ఎందుకంటే ఎన్టీఆర్ ను గద్దె దించడంలో చంద్రబాబుకు సహకరించిన వారిలో ఈయన పాత్ర చాలానే ఉందని టాక్ ఉంది. డిప్యూటీ మినిష్టర్ పదవి కోసం ఆశపడగా చంద్రబాబు అప్పట్లో ఒప్పుకోలేదని కథనాలు వచ్చాయి.. దీంతో హరికృష్ణతో కలిసి అన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ వర్కౌట్ కాకపోవడంతో బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. ఇక ఆ తరువాత కాంగ్రెస్ లోకి వెళ్లి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (1984, 1985,1989, 2004, 2009) గెలుపోటముల మధ్య రాజకీయాల్లో ఉన్నారు.  

ఆయన సతీమణి ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి వెంకటేశ్వర రావ్ మాత్రం రాజకీయాలకు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు.  

చాలా వరకు బాలకృష్ణ వివాదాల జోలికి వెళ్లకుండా ఎన్టీఆర్ తాలూకు ఆలోచన విధానాన్ని మాత్రమే సినిమాలో చూపించే విధంగా దర్శకుడు క్రిష్ తో వర్క్ చేస్తున్నాడు. ఎవరిని ఎలా చూపించాలి అనే విషయంలో చిత్ర యూనిట్ తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పాత్రను ఏ విధంగా ప్రజెంట్ చేస్తారో చూడాలి.

click me!