40లోకి వస్తోన్న ప్రభాస్.. దొరికితే పెళ్లేనట!

By Prashanth MFirst Published Oct 23, 2018, 5:58 PM IST
Highlights

నేడు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు విషెష్ అందిస్తున్నారు. ఇక 39వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ప్రభాస్ గురించి ప్రస్తుతం ఒక న్యూస్ మరోసారి వైరల్ గా మారింది. 

బాహుబలితో నేషనల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ నెక్స్ట్ సాహో సినిమాతో కూడా అదే రేంజ్ లో హిట్టుకొట్టాలని అనుకుంటున్నాడు. నేడు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు విషెష్ అందిస్తున్నారు. ఇక 39వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ప్రభాస్ గురించి ప్రస్తుతం ఒక న్యూస్ మరోసారి వైరల్ గా మారింది. 

గతంలో ఆయన పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళి మ్యారేజ్ గురించి టాక్ వస్తోంది. ప్రభాస్ నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టకముందే పెళ్లి చేసేయాలని కుటుంబ సభ్యులు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట. గతంలోనే కృష్ణం రాజు ప్రభాస్ ఏమైనా చిన్న పిల్లాడా? అతనికి తెలియదా? మేము చెప్పి చూశామని అన్నారు. 

అంటే ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని క్లారిటీగా అర్థమైంది. కానీ ఇప్పుడు మాత్రం ఎలాగైనా ప్రభాస్ రాజు గారి వివాహవేడుక తంతు ముగించాలని ఫ్యామిలీ పెద్దలు డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రభాస్ వచ్చే సమ్మర్ వరకు షూటింగ్ లతోనే బిజీగా ఉంటాడు కాబట్టి అప్పటివరకు పెళ్లి కుదిరినా జరగడం కష్టమే.

అయితే ఆ తరువాత ఒంటరిగా దొరుకుతాడు కాబట్టి పెళ్లి చేసి ఓ ఇంటివాన్నీ చెయ్యాలని అనుకున్నారట. మరి రెబల్ స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

click me!