యాక్సిడెంట్ చేసిన దగ్గుబాటి సురేష్ బాబు!

Published : Oct 22, 2018, 10:25 AM IST
యాక్సిడెంట్ చేసిన దగ్గుబాటి సురేష్ బాబు!

సారాంశం

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారులో ప్రయాణిస్తుండగా ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆయన ప్రయాణిస్తోన్న కారు ఓ బైక్ ని ఢీ కొట్టడంతో ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారులో ప్రయాణిస్తుండగా ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆయన ప్రయాణిస్తోన్న కారు ఓ బైక్ ని ఢీ కొట్టడంతో ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వేగంగా వస్తోన్న సురేష్ బాబు కారు, అదుపుతప్పి యాక్సిడెంట్ చేసినట్లు తెలుస్తోంది. కారు ఢీ కొట్టడంతో బైక్ పై వెళ్తున్న దంపతులు, వారి మూడేళ్ల చిన్నారి కిందపడిపోయారు. వారి గాయాలు బలంగా తగలడంతో స్థానికులు వెంటనే హాస్పిటల్ కి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తరువాత దగ్గుబాటి సురేష్ బాబు మరో వాహనాన్ని తెప్పించుకొని అక్కడ నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

Toxic Cast Remuneration: రెమ్యూనరేషన్‌లో యష్‌ కి నయనతార గట్టి పోటీ.. టాక్సిక్ స్టార్ల జీతాల వివరాలు
Sridivya without Makeup: మేకప్ లేకుండా నేచురల్‌ అందంతో కట్టిపడేస్తున్న శ్రీదివ్య.. లేటెస్ట్ ఫోటోలు