దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024 : ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా...

By SumaBala Bukka  |  First Published Feb 21, 2024, 9:18 AM IST

ముంబైలో, 2024 దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024లో సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడి కేటగిరీలో అవార్డు అందుకున్నారు.


ముంబై : ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు సినీరంగంలో ప్రతిభను చాటుకునేందుకు మంగళవారం (ఫిబ్రవరి 20) ముంబయిలో స్టార్-స్టడెడ్ ఎఫైర్ జరిగింది.

అట్లీ దర్శకత్వం వహించిన జవాన్‌లో నటనకు గాను షారూఖ్ ఖాన్, నయనతార లు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులను కైవసం చేసుకున్నారు. 

Latest Videos

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన, విపరీతంగా చర్చకు దారితీసిన యానిమల్ సినిమాకు అవార్డుల పంట పండింది. సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. యానిమల్ ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లు సంపాదించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

యానిమల్‌లో అబ్రార్ పాత్రలో అద్భుతమైన నటను ప్రదర్శించిన బాబీ డియోల్ ప్రతినాయకుడికి కేటగిరీలో అవార్డును దక్కించుకున్నారు. ఈ సినిమాలో బాబీడియోల్ నటనకు ప్రశంసల జల్లు కురిసింది. 

మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన సామ్ బహదూర్‌లో ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా పాత్రలో నటించిన విక్కీ కౌశల్ కు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డు లభించింది.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు 2024 విజేతలు వీరే..

ఉత్తమ నటుడు : షారుఖ్ ఖాన్ (జవాన్)
ఉత్తమ నటి : నయనతార (జవాన్)
ఉత్తమ ప్రతినాయకుడు : బాబీ డియోల్ (యానిమల్)
ఉత్తమ డైరెక్టర్ : సందీప్ రెడ్డీ వంగా (యానిమల్)
ఉత్తమ నటుడు (క్రిటిక్) : విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
 

click me!