
కొద్ది రోజుల క్రితం వరకు మన్సూర్ అలీఖాన్, ఓ నటికి సంబంధించిన వివాదం నడిచింది . కోర్టుకు ఎక్కి మరీ అక్షింతలు వేయించుకున్నాక ఆ వివాదం సర్దుమణిగింది. తాజాగా ఓ పొలిటీషన్ ఓ నటి పై వివాదాస్పద కామెంట్స్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. డబ్బులిచ్చి ఓ నటిని పిలిపించుకున్నారు.. ఆమెపై పొలిటీషియన్ ఘోరమైన కామెంట్స్ చేసారు! ఆ వీడియో ఇప్పుడు తమిళనాట వైరల్ అవుతోంది.
తమిళనాడులోని ఏఐఏడీఎంకే పార్టీ పార్టీకి చెందిన మాజీ రాజకీయ నాయకుడు ఏవీ రాజు మీడియాతో మాట్లాడుతూ... కొందరు రాజకీయ నాయకులు రూ.25 లక్షలు చెల్లిస్తాం రావాలని ఒక నటిని కోరినట్లు, రిసార్ట్ కు పిలిపించుకున్నట్లు మాట్లాడాడు. ఎమ్మెల్యే జి.వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన రాజు, ఆ నటి వ్యక్తిగత జీవితంపైన కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియూ క్లిప్ కాస్త సోషల్ మీడియాకు ఎక్కడంతో వివాదం మొదలైంది. ఈ వీడియోపై స్పందించిన ఆ నటి అభిమానులు, నెటిజన్లు ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోండంటూ రిప్లై ఇచ్చారు.
అటెన్షన్ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉందంటూ ప్రముఖ నటి అసహనం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇకపై తాను ఇచ్చే సమాధానం లీగల్ డిపార్ట్‌మెంట్ నుంచే వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ (ఇంతకుముందు ట్విటర్) లో పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో ‘ఆ నటి .. మీకు మేం ఉన్నాం’ అంటూ పలువురు సినీ తారలు సైతం మద్దతు ఇచ్చారు
నటుడు విశాల్ రియాక్ట్ అయ్యాడు. ఓ సినిమా నటిపై తీవ్ర అసభ్యకరంగా కామెంట్లు చేశారని అవి ఏ మాత్రం అమోదయోగ్యం కావని ఖండించాడు. ప్రభుత్వం వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొరుతూ సదరు నాయకునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ నటి ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ‘స్టాలిన్’ తర్వాత చిరంజీవి సరసన ఆ నటి నటిస్తున్న చిత్రమిదే.