'మా' ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్.. రెండు రోజుల్లో కారణం చెబుతా, ఈ ట్విస్ట్ ఏంటి..

By telugu teamFirst Published Oct 2, 2021, 2:29 PM IST
Highlights

'మా' ఎన్నికలలో రోజుకొక ఊహించని పరిణామం సహజంగా మారిపోయింది. కొన్నిరోజుల క్రితం వరకు కూడా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో పాటు జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు లాంటి సెలెబ్రిటీలు అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచారు.

'మా' ఎన్నికలలో రోజుకొక ఊహించని పరిణామం సహజంగా మారిపోయింది. కొన్నిరోజుల క్రితం వరకు కూడా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో పాటు జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు లాంటి సెలెబ్రిటీలు అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా జీవిత, హేమ ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరిపోయారు. దీనితో అధ్యక్ష పదవి పోటీలో ప్రకాష్ రాజ్, విష్ణు, సీవీఎల్ ముగ్గురే నిలిచారు. 

తాజాగా సీవీఎల్ కూడా తాను మా ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సీవీఎల్ తన నామినేషన్ ని కూడా ఉపసంహరించుకున్నారు. ఈ ఉదయమే తన మేనిఫెస్టో ప్రకటించిన సీవీఎల్ తాజాగా నామినేషన్ ఉపసంహరించుకోవడం షాకింగ్ పరిణామమే. 

దీనితో మా ఎన్నికల్లో ఫేస్ టు ఫేస్ ఫైట్ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్యే అని స్పష్టం అయిపోయింది. సీవీఎల్ తన నామినేషన్ ఉపసంహరణపై స్పందించారు. నేను నా నామినేషన్ ఉపసంహరించుకోవడానికి కారణం ఉంది. అన్ని విషయాలని రెండు రోజుల్లో మీడియాకు చెబుతాను. నాకు అధ్యక్ష పదవి కంటే మా సభ్యుల సంక్షేమమే ముఖ్యం. ప్రస్తుతం ఉన్న ప్రకాష్ రాజ్ప్యానల్,మంచు విష్ణు ప్యానల్ లో ఎవరికీ నేను మద్దతు ఇవ్వడం లేదు అని సీవీఎల్ స్పష్టం చేశారు. 

సీవీఎల్ నరసింహారావు టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. సీవీఎల్ మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు.. తెలంగాణ ఆర్టిస్టులకు టాలీవుడ్ లో అవకాశాలు లభించడం లేదని విమర్శించిన సంగతి తెలిసిందే. 

click me!