ఆమెకు పబ్లిక్ గా రితేష్ కిస్సులు.. కోపంతో రగిలిపోయిన జెనీలియా, ఆ సంఘటనపై తొలిసారి..

By telugu teamFirst Published Oct 2, 2021, 1:19 PM IST
Highlights

వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు గుడ్ బై చెప్పింది. అయినప్పటికీ జెనీలియా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబందించిన విశేషాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. 

తన నటనకు చిలిపిదనం, అల్లరి చేష్టలు జోడిస్తూ జెనీలియా తెలుగు ప్రేక్షకులని అలరించింది. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. 2012లో జెనీలియా నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. 

వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు గుడ్ బై చెప్పింది. అయినప్పటికీ జెనీలియా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబందించిన విశేషాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. 

2019లో జెనీలియా తన భర్త రితేష్ తో కలసి ఐఫా అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైంది. వేదికపై రితేష్ ప్రవర్తించిన తీరు.. దానికి జెనీలియా ఇచ్చిన హావభావాలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. నెటిజన్లు ఈ సంఘటనపై మీమ్స్ తో హంగామా చేశారు. 

జెనీలియా, రితేష్, సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా మరికొందరు సెలెబ్రిటీలు వేదికపై ఉన్నారు. రితేష్.. ప్రీతి జింతాని హగ్ చేసుకుని ఆమె చేతులపై ముద్దులు పెట్టాడు. పక్కనే ఉన్న జెనీలియా ఈ సంఘటన చూస్తూ ముఖం మాడ్చుకున్నట్లు, కోపంతో రగిలిపోతున్నట్లు హావభావాలు పెట్టింది. 

భర్త మరో అమ్మాయికి ముద్దు పెడితే భార్యలు ఇలా కాక ఇంకెలా ఉంటారు అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో జెనీలియాపై ఎన్నో మీమ్స్ క్రియేట్ అయ్యాయి. ఆ సంఘటనపై జెనీలియా ఎట్టకేలకు పెదవి విప్పింది. తాను వేదికపై అనీజీగా ఉండడానికి కారణం రితేష్.. ప్రీతి జింతాకు ముద్దులు ఇవ్వడం కాదని తెలిపింది. 

అర్భాజ్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న పించ్ సీజన్ 2 షోకి జెనీలియా, రితేష్ అతిథులుగా హాజరయ్యారు. అర్భాజ్ ఆ సంఘటన గురించి జెనీలియాని ప్రశ్నించాడు. దీనికి జెనీలియా సమాధానం ఇస్తూ.. నేను ఆరోజు కొత్త డ్రెస్, హై హీల్స్ వేసుకుని ఫంక్షన్ కి వెళ్ళాను. చాలా రోజుల తర్వాత నేను హాజరైన ఫంక్షన్ అది. హై హీల్స్, డ్రెస్ బాగా చిరాకుగా అనిపించాయి. అందుకే ఆ రోజు అలా కనిపించాను అని జెనీలియా రివీల్ చేసింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Genelia Deshmukh (@geneliad)

click me!