
నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ చిత్రంలో నాని నటన నెక్స్ట్ లెవల్ అంతే. ఈ మూవీతో గౌతమ్ తిన్ననూరి క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఒకవైపు కుటుంబ సమస్యలు, మరోవైపు ఆరోగ్య సమస్యలు ఉన్నపటికీ ఓ క్రికెటర్ తన కలని ఎలా సాకారం చేసుకున్నాడు అనేదే ఈ చిత్ర కథ.
నాని నటన ఈ చిత్రంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. గౌతమ్ తిన్ననూరి రచనకు నాని వందశాతం న్యాయం చేశారు. నాని స్వయంగా జెర్సీ చిత్రం తన కెరీర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పాడంటే జెర్సీ సత్తా ఎంతో అర్థం చేసుకోవచ్చు.
సౌత్ సినిమాలని ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు వెంటనే రీమేక్ చేసేస్తున్నారు. తెలుగులో జెర్సీ మంచి విజయం సాధించడంతో షాహిద్ కపూర్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. రీమేక్ వర్షన్ కి కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వచించారు. కానీ హిందీలో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. సెలెబ్రిటీల నుంచి మాత్రం మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
తాజాగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్.. షాహిద్ కపూర్ జెర్సీ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. జెర్సీ చిత్రం చూసిన అనంతరం.. జెర్సీ అద్భుతమైన, ఇన్స్పైరింగ్ మూవీ.. సోదరుడు షాహిద్ కపూర్ నటన చాలా బావుంది. గ్రేట్ వర్క్ అంటూ ట్వీట్ చేశాడు.
అయితే మహమ్మద్ అమీర్ ట్వీట్ కి నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు. జెర్సీ ఒరిజినల్ వర్షన్ తెలుగులో తెరకెక్కింది. ముందు దానికి క్రెడిట్ ఇవ్వాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు.. బాలీవుడ్ లో వస్తున్న మంచి సినిమాలు అన్నీ సౌత్ మూవీస్ కి కాపీ పేస్ట్ లే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.