‘ఎఫ్ 4’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. అసలు ‘ఎఫ్3’లోనే ఆ పని చేయాల్సిందంట..

Published : May 26, 2022, 03:07 PM IST
‘ఎఫ్ 4’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. అసలు ‘ఎఫ్3’లోనే ఆ పని చేయాల్సిందంట..

సారాంశం

‘ఎఫ్2’కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘ఎఫ్3’. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతున్న క్రమంలో  ‘ఎఫ్4’పైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.  

వెంకటేశ్ - వరుణ్ తేజ్ ప్రధాన పాత్రదారులుగా మల్టీస్టారర్ మూవీ 'ఎఫ్ 3'  రూపొందింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం మే 27న (రేపు) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కరోనా తర్వాత నవ్వుల పండుగా తీసుకురాబోతోందంటూ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వెల్లడించారు. ప్రమోషన్స్ కూడా గట్టిగానే నిర్వహించడంతో సినిమాపై ప్రేక్షకుకుల్లో ఆసక్తి నెలకొంది.  

ఈ సందర్భంగా అనిల్ రావుపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎఫ్3 మూవీ కచ్చితంగా అందరినీ నవ్విస్తుందని హామీనిచ్చారు. ఎఫ్2ను మించిన కామెడీ ఇందులో ఉందని, ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సినిమాను రూపొందించామని చెప్పారు. అయితే ఎఫ్3లోనే మరో స్టార్ హీరోని చేర్చాల్సి ఉందని తెలిపారు. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. కానీ ఎఫ్4లో కచ్చితంగా మరో స్టార్ తో ఫన్ డోస్ పెంచుతామన్నారు. దీంతో ‘ఫన్ అండ్ ఫస్ట్రేషన్ నుంచి మూడో భాగంగా కూడా రానున్నట్టు కన్ఫమ్ అయ్యింది.

ఎఫ్3లో ఇప్పటికే ఎఫ్2 స్టార్ కాస్ట్ తోపాటు మరో ముగ్గురు స్టార్స్ సునీల్, సోనాల్ చౌహాన్, పూజా హెగ్దేలను  చేర్చారు అనిల్ రావిపూడి.  దీంతో సందడి మరింతగా పెరగనున్నదని అర్థమవుతోంది. అదనంగా మరో నటుడు మురళీ శర్మను కూడా ఎంపిక చేశారు. ఎఫ్3లో హీరోయిన్స్ తమన్నా భాటియా, మెహ్రీన్ మరింతగా గ్లామర్ ఒలకబోసినట్టుగా పాటలను బట్టి తెలుస్తోంది. ‘సమ్మర్ సోగ్గాళ్ల’ ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక రేపటి నుంచి ఎఫ్3 హవా కొనసాగనుంది.

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది