
బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ తన ‘తొలి ప్రేమైన యాక్టింగ్’ పై దృష్టి పెట్టడానికి తన నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ (CSF) నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అలా ఎందుకు తొలిగిపోతుందో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన నోట్‌ను పంచుకుంటూ తెలిపింది. అయితే క్లీన్ స్లేట్ ఫిలింజ్ ప్రొడక్షన్ కంపెనీని అక్టోబర్ 2013లో అనుష్క శర్మ మరియు ఆమె సోదరుడు కర్నేష్ శర్మ ఇద్దరు కలిసి స్థాపించారు. ఈ కంపెనీ ద్వారా సినిమాల నిర్మాణం మరియు పంపిణీ చేస్తున్నారు. ముంబై కేంద్రంగా ఈ సంస్థ కొనసాగుతోంది. ఈ బ్యాన్ ద్వారా ఎన్ హెచ్ 10 , పాటల్ లోక్, బుల్బుల్ వంటి ప్రశంసలు పొందిన ప్రాజెక్ట్‌లను నిర్మించారు. అయితే తను తన ఫస్ట్ లవ్ యాక్టింగ్ కేరీర్ కోసం CSF నుంచి తొలగిపోతున్నట్టు పేర్కొంది. ఈ మేరకు సుదీర్ఘమైన నోట్ ను పోస్ట్ చేసింది. ‘ఇప్పటి నుంచి, ఇకపై సీఎస్ఎఫ్ కర్నేష్ దే.. నా బెస్ట్ విషెస్ ఎప్పటికీ మీకు ఉంటాయి’ అంటూ పేర్కొంది.
అనుష్క తన నోట్‌లో, ‘నేను నా సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి క్లీన్ స్లేట్ ఫిలింజ్‌ని ప్రారంభించినప్పుడు.. ప్రొడక్షన్ విషయానికి వస్తే మేము కొత్తవాళ్లమే. కానీ మాలో ఫైర్ పెరిగింది. భారతదేశంలో వినోదం కోసం ఓ ఎజెండాను తయారు చేసేందుకు ప్రయత్నించాలనుకున్నాం. ఆ మేరకు ఇప్పటివరకు సీఎస్ఎఫ్ తో నా ప్రయాణం కొనసాగింది. ఈ సంస్థ ద్వారా మేము సాధించగలిగిన విషయాల పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. కమర్షియల్ ప్రాజెక్ట్‌లు ఎలా ఉండానే ధ్రుష్టితో CSF ప్రారంభించాం. ఇందుకు CSF బాగుకోసం అద్భుతంగా పనిచేసిన కర్నేష్‌కి నేను ఘనత వహించాలి. అలాగే సీఎస్ఎఫ్ టీంకి నా శుభాకాంక్షలు’ అంటూ తెలిపింది.
ప్రస్తుతం అనుష్క శర్మ నెట్ ఫ్లిక్స్ కోసం ‘చక్దా ఎక్స్ ప్రెస్, మై, ఖలా’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈ చిత్రాల్లోలోని మై, ఖలా మూవీలను క్లీన్ స్లేట్ ఫిలింజ్ తెరకెక్కిస్తోంది. ‘ఖలా’ చిత్రంతో ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ సినిమాల్లోకి ప్రవేశిస్తుంది. ఖలా చిత్రం నెట్ ఫ్లిక్స్ కోసం రూపుదిద్దుకుంటోంది. ఈ మూడు చిత్రాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి.