SSMB28 కి క్రేజీ టైటిల్ , ఎనౌన్స్ మెంట్ ఎప్పుడంటే...

Published : Mar 06, 2023, 12:19 PM IST
 SSMB28 కి  క్రేజీ టైటిల్ , ఎనౌన్స్ మెంట్ ఎప్పుడంటే...

సారాంశం

మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ క‌లయిక‌లో దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత #SSMB28 వ‌ర్కింగ్ టైటిల్ పేరిట ఓ భారీ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో సినిమా ఇది.

ఈ మధ్యకాలంలో ఓ రేంజిలో హైప్ అయిన ప్రాజెక్టు  SSMB28. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌బాబు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న చిత్రం కావటంతో అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి.  త్రివిక్ర‌మ్ గ‌త సినిమాల‌కు భిన్నంగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా విశేషాలు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో మహేష్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంతకు ముందు  త్రివిక్రమ్ టీమ్ సారధి స్టూడియోస్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే SSMB28 మేకర్స్ ఈ చిత్రానికి రెండు టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారు.

 టైటిల్‌ను ఉగాది సంద‌ర్భంగా మార్చి 22న రివీల్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను ఉగాదికి రిలీజ్ చేయ‌నున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.  చాలా రోజులుగా SSMB28 కి ‘అర్జునుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారంలో ఉంది. అది కాకపోతే  అయోధ్య‌లో అర్జునుడు అనే టైటిల్ అయినా పెట్టే అవకాసం ఉంది. త్రివిక్రమ్‌కు ‘అ’ సెంటిమెంట్ ఉండడంతో.. దాదాపుగా ఈ రెంటిలో ఒకటి  లాక్ చేసే అవకాసం ఉన్నట్టు  చెప్తున్నారు.

అయితే సినిమా షూటింగ్ అయిన విష‌యాన్ని వెల్ల‌డిస్తూ అప్పుడు #SSMB28Arambham అనే హ్యాష్ ట్యాగ్‌తో ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర టీమ్. దీంతో సినిమాకు ఆరంభం అనే టైటిల్‌ను ఫైన‌ల్ చేస్తున్నారు కాబ‌ట్టే ఆ హ్యాష్ ట్యాగ్‌తో నెట్టింట వైర‌ల్ అయ్యేలా చేశార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్రివిక్ర‌మ్ A సెంటిమెంట్ ప్ర‌కారం చూస్తే ఈ వార్త నిజ‌మ‌య్యే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదని కొందరంటున్నారు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే వచ్చే ఛాన్సుంది.

 ఇక మహేష్, త్రివిక్రమ్ కాంబో సెట్ అవడానికే పుష్కర కాలం పట్టింది. అందుకు తగ్గట్టే.. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 కూడా నత్త నడకన సాగుతోంది. కానీ నెక్స్ట్ రాజమౌళి ప్రాజెక్ట్ ఉండడంతో.. స్పీడ్ పెంచాడు మహేష్.   ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్‌కు రెడీ అవుతున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న   ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం