
స్టార్ లేడీ కత్రినా కైఫ్ 2021లో హీరో విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా కత్రినా గర్భవతి అయ్యారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఆమె లేటెస్ట్ లుక్ కారణమైంది. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత ఖాన్ ముంబైలో గ్రాండ్ ఈద్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఆమె అనార్కలి డిజైనర్ వేర్లో అద్భుతంగా ఉన్నారు.
కత్రినా కైఫ్ కొంచెం ఒళ్ళు చేశారు. ఆమె అందంగా కనిపిస్తున్నారు. కాబట్టి గర్భవతి అయ్యారేమో అంటూ పలువురు నెటిజెన్స్ సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ వైరల్ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే కత్రినా స్వయంగా వెల్లడించాలి. లేదంటే మరి కొన్ని రోజులు ఆగాలి.
కత్రినా కైఫ్ తెలుగులో వెంకటేష్, బాలయ్య చిత్రాల్లో నటించారు. కత్రినా కైఫ్ రెండవ చిత్రం మల్లీశ్వరి. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే బాలయ్యకు జంటగా అల్లరి పిడుగు చిత్రంలో నటించారు. అల్లరి పిడుగు నిరాశపరిచింది. బాలీవుడ్ లో బిజీ అయిన కత్రిన మరలా తెలుగులో చిత్రాలు చేయలేదు.
దశాబ్దం పాటు కత్రిన బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. సల్మాన్ ఖాన్, రన్బీర్ కపూర్ వంటి హీరోలతో ఎఫైర్స్ నడిపారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం కత్రిన మెర్రి క్రిస్మస్, టైగర్ 3 చిత్రాల్లో నటిస్తున్నారు. అటు ప్రొఫెషనల్ గా పర్సనల్ గా కత్రిన విజయపథంలో సాగిపోతుంది.