తారకరత్న పాత్రలో బాలీవుడ్ హీరో.. డైరెక్టర్ స్కెచ్ ?

Published : Apr 23, 2023, 07:21 PM IST
తారకరత్న పాత్రలో బాలీవుడ్ హీరో.. డైరెక్టర్ స్కెచ్ ?

సారాంశం

నందమూరి తారకరత్న అభిమానులకు ఒక జ్ఞాపకంలా మారిపోయారు. తారకరత్న మరణించి నెలలు గడచిపోతోంది. నందమూరి తారక రత్న ఫిబ్రవరి 22న గుండె సంబంధిత సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.

నందమూరి తారకరత్న అభిమానులకు ఒక జ్ఞాపకంలా మారిపోయారు. తారకరత్న మరణించి నెలలు గడచిపోతోంది. నందమూరి తారక రత్న ఫిబ్రవరి 22న గుండె సంబంధిత సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే తారకరత్న ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండేవారు. 

కానీ కలలో కూడా ఊహించని విధంగా లోకేష్ పాదయాత్ర సమయంలో తారక రత్న కుప్పకూలడం.. ఆసుపత్రిలో కొన్ని రోజుల చికిత్స తర్వాత మరణించడం జరిగింది. తారక రత్న బాబాయ్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యతో నటించాలనేది తారక రత్నకి తీరని కోరికగా మిగిలిపోయింది. అయితే అనిల్ రావిపూడి ఈ చిత్రంలో తారకరత్న కోసం ఒక పాత్ర కూడా రాశారట.

తారకరత్న క్షేమంగా ఉండిఉంటే ఆ పాత్రలో నటించి ఉండేవారు. నెగిటివ్ షేడ్స్ లో ఆ రోల్ పవర్ ఫుల్ గా ఉంటుందట. ఇప్పుడు తారకరత్న లేకపోవడంతో అనిల్ రావిపూడి ఆ పాత్ర కోసం మరో నటుడి అన్వేషణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం అనిల్ రావిపూడి బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్య కోసం అనిల్ రావిపూడి అదిరిపోయే స్కెచ్ వేశారని అంటున్నారు. 

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పవర్ ఫుల్ గా కూడా కనిపించాలి. ఆ రోల్ కి అర్జున్ కపూర్ సెట్ అవుతారని అనిల్ భావిస్తున్నారట. అనిల్ , బాలయ్య కలయికలో తొలిసారి వస్తున్న ఈ చిత్రం కామెడీ టచ్ ఉంటూనే అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయట. బాలయ్య ఈ చిత్రంలో కాళీమాత భక్తుడిగా కనిపిస్తారని అంటున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్