బికినీ వేసినందుకు అక్షరాలా పది కోట్లు..?

By Sambi Reddy  |  First Published Mar 22, 2023, 6:11 PM IST

హీరోయిన్ నయనతార గురించి ఓ క్రేజీ న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. షారుక్ కి జంటగా నటించిన జవాన్ మూవీలో ఆమె బికినీ ధరించారని ప్రచారమవుతోంది. 
 


నయనతార కెరీర్లో బోల్డ్ రోల్స్ చేశారు. కొన్ని సినిమాల్లో స్కిన్ షో చేయడానికి వెనకాడలేదు. అజిత్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం బిల్లా లో ఆమె బికినీని పోలిన డ్రెస్ లో దర్శనమిచ్చారు. అయితే లేటెస్ట్ మూవీ కోసం ఆమె టూ పీస్ బికినీ వేశారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. షారుక్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ మూవీలో ఆమె ఈ సాహసం చేయనున్నారట. నయనతార ఓ సన్నివేశంలో బికినీలో కనిపిస్తారని కథనాలు వెలువడుతాయి. 

ఈ క్రమంలో ఆమె రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేశారట. జవాన్ చిత్రానికి నయనతార రూ. 10 కోట్లు తీసుకుంటున్నారట. ఇది సౌత్ లో నయనతార తీసుకునే రెండు చిత్రాల రెమ్యూనరేషన్ కి సమానం. పెళ్లయ్యాక బికినీ వేయడం వంటి బోల్డ్ డెసిషన్ ఆమె తీసుకున్నారా? ఈ వార్తల్లో అసలు నిజం ఉందా? అనే చర్చ మొదలైంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఎదురు చూడాల్సిందే. 

Latest Videos

కాగా నయనతార గత ఏడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన చిరకాల ప్రేమికుడు విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేశారు. మహాబలేశ్వరంలో నయనతార-విగ్నేష్ వివాహం జరిగింది. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరిగిన నయనతార మీద టీటీడీ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార క్షమాపణలు చెప్పడంతో ఆమెపై చర్యలు తీసుకోలేదు. 

వివాహం జరిగిన నెలల వ్యవధిలో నయనతార కవల పిల్లలకు తల్లైనట్లు ప్రకటించారు. ఇదో వివాదమైంది. నయనతార దంపతులు సరోగసీ నిబంధనలు అతిక్రమించారనే సందేహంతో తమిళనాడు ప్రభుత్వం విచారణ జరిపింది. మాకు ఐదేళ్ల క్రితమే వివాహం జరిగింది. భారతదేశ సరోగసీ చట్టంలో ఉన్న అన్ని నిబంధనలు పాటించినట్లు నయనతార దంపతులు ఆధారాలు చూపి సమస్య నుండి బయటపడ్డారు. 

ప్రస్తుతం నయనతార జవాన్ తో పాటు ఓ తమిళ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాల అనంతరం నయనతార సినిమాలకు విరామం ప్రకటిస్తారనే వాదన ఉంది. ఇక జవాన్ జూన్ 2న విడుదల కానుంది. ప్రియమణి, విజయ్ సేతుపతి కీలక రోల్స్ చేస్తున్నారు. దీపికా పదుకొనె గెస్ట్ రోల్ లో మెరవనున్నారు. పఠాన్ మూవీతో షారుక్ ఖాన్ ఫార్మ్ లోకి వచ్చారు. జవాన్ పై అంచనాలు ఏర్పడ్డాయి. 

click me!