#GunturKaaram: ఓవర్ సీస్ అడ్వాన్స్ ..అసలు ఎక్సపెక్ట్ చేయని ఫిగర్

By Surya PrakashFirst Published Jan 10, 2024, 11:50 AM IST
Highlights

‘‘సర్రు మండుతాది బాబు గొడ్డు కారం.. గిర్ర తిరుగుతాది ఈడి తోటి బేరం’’ అనే పాట ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఆ పాటను పాడేసుకుంటూ అడ్వాన్స్ బుక్కింగ్స్ తో హోరెత్తిస్తున్నారు అబిమానులు. తెలుగు రాష్ట్రాల్లో ఆ కిక్ ఎలానో ఉంటుంది మరి ఓవర్ సీస్ పరిస్దితి ఏమిటో చూస్తే...


‘గుంటూరు కారం’అడ్వాన్స్ బుక్కిగ్స్ తో ట్రెండింగ్ లో ఉంది. ఈ సంక్రాంతికి  ఘాటుతో పసందైన దమ్‌ మసాలా బిర్యానీ వడ్డించేందుకు సిద్ధమవు  తున్నారు మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన ఈ మాస్‌ యాక్షన్‌ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘‘సర్రు మండుతాది బాబు గొడ్డు కారం.. గిర్ర తిరుగుతాది ఈడి తోటి బేరం’’ అనే పాట ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఆ పాటను పాడేసుకుంటూ అడ్వాన్స్ బుక్కింగ్స్ తో హోరెత్తిస్తున్నారు అబిమానులు. తెలుగు రాష్ట్రాల్లో ఆ కిక్ ఎలానో ఉంటుంది మరి ఓవర్ సీస్ పరిస్దితి ఏమిటో చూస్తే...

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కు అడ్వాన్స్ బుక్కింగ్ లు అదిరిపోతున్నాయి. ఇప్పటికే $800K రేంజిని రీచ్ అయ్యింది. $1.5M+ వస్తుందని అంచనా వేస్తున్నారు. టోటల్ ప్రీమియర్స్  + ఓపినింగ్ డే అడ్వాన్స్ బుక్కింగ్స్ $950K దాటుతాయంటున్నారు. ఆ రోజున ఇంకొన్ని కొత్త షోలు, లొకేషన్స్ యాడ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. UK,ఆస్ట్రేలియా ఇంకా ఇతర రీజియన్స్ లో యావరేజ్ ప్రీ రిలీజ్ సేల్స్ ఫస్డ్ డే  250K ని రీచ్ అవుతాయని భావిస్తున్నారు. టోటల్ గా మొదటి రోజు ప్రీ రిలీజ్ ఓవర్ సీస్ సేల్స్ రేంజ్ 1.2M [10Cr] ఉండబోతోందని అంచనా. మిడిల్ ఈస్ట్ బుక్కింగ్స్ ఓపెన్ అయ్యితే పెద్ద జంప్ ఉంటుంది. 
 
  నిర్మాత నాగవంశీ (Naga Vamsi)మాట్లాడుతూ... ‘‘చాలా కాలం నుంచి మహేశ్‌తో సినిమా చేయాలనుకుంటున్నా. ‘గుంటూరుకారం’తో అది నెరవేరింది. సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుంది. ఫస్టాఫ్‌ రీరికార్డింగ్‌ పూర్తైంది. సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ ఇది. ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది.  ’’ అని ఆయన చెప్పారు. త్రివిక్రమ్‌ - మహేశ్‌ హ్యాట్రిక్‌ కాంబోలో వస్తోన్న చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్. ఈ చిత్రానికి ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస. 
 

Latest Videos

click me!