Prabhas: వరల్డ్ వార్ 2 నేపథ్యంలో ప్రభాస్ మూవీ... డైరెక్టర్ ఎవరంటే? 

By Sambi Reddy  |  First Published Nov 20, 2023, 7:30 AM IST


ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల లిస్ట్ పెద్దదే. సలార్ విడుదలకు సిద్ధం అవుతుండగా... కల్కి, రాజా డీలక్స్ సెట్స్ పై ఉన్నాయి. కాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ఆయన ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
 



బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి హిట్ లేదు. సాహో మాత్రమే ఓ మోస్తరు విజయం అందుకుంది. హిందీలో రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్ అయ్యాయి. కాగా డిసెంబర్ 22న విడుదల కానున్న సలార్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో జనాల్లో హైప్ ఏర్పడింది. అదే స్థాయిలో సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సలార్ తో ప్రభాస్ తన స్థాయి విజయం అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

అనంతరం ప్రభాస్ నుండి కల్కి 2898 AD రానుంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సోషియో ఫాంటసీ అంశాలతో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది కల్కి విడుదల కానుంది. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ చేస్తున్నాడు. ఇది కామెడీ హారర్ థ్రిల్లర్ అంటున్నారు. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. స్పిరిట్ టైటిల్ తో ఈ మూవీ రూపొందనుంది. 

Latest Videos

undefined

సలార్ కి సీక్వెల్ ఉంటుందని అంటున్నారు. కాగా ప్రభాస్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేశాడట. సీతారామం మూవీతో భారీ హిట్ కొట్టిన హను రాఘవపూడితో మూవీ చేసేందుకు సై అన్నాడట. ఇది వరల్డ్ వార్ 2 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తారట. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో పాటు యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తారట. 

ఈ మేరకు టాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చేందుకు చాలా సమయం పట్టే సూచనలు ఉన్నాయి. మరో రెండేళ్లు ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశం లేదు. ఇటీవల ప్రభాస్ కి మోకాలి సర్జరీ జరిగింది. నెల రోజులకు పైగా విదేశాల్లో రెస్ట్ తీసుకున్న ప్రభాస్ ఇండియాకు వచ్చారు. 

Salaar Cease Fire : ‘సలార్’ రన్ టైమ్ ఎంతో తెలుసా? ఫ్యాన్స్ కు పునకాలే

click me!