
లైగర్(Liger)మూవీ విడుదలకు కేవలం మరో నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేస్తుండగా... ఈ సినిమాలో పోరాటాలు హైలెట్ గా నిలవనున్నాయి. కాగా ఫ్రీ క్లైమాక్స్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ ఓ ప్రత్యేకమైన ఫైట్ రూపొందించారట. ఈ ఫైట్ ప్రత్యేకత ఏమిటంటే విజయ్ 14 మంది అమ్మాయిలతో ఫైట్ కి దిగుతాడట. గుంపుగా లేడీ ప్రొఫెషనల్ ఫైటర్స్ విజయ్ దేవరకొండకు ముచ్చెమటలు పట్టిస్తారని సమాచారం.
ఈ ఫైట్ కోసం పూరి(Puri Jagannadh) పారిన్ లేడీ ఫైటర్స్ ని దించాడట. ఐదు నిమిషాలకు పైగా సాగే ఈ ఫైట్ ఉత్కంఠభరితంగా సాగుతుందట, ఈ ఫైట్ సినిమాకే హైలైట్ కానుందనేది టాలీవుడ్ టాక్. ఇక ఈ మూవీలో మాజీ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అతనితో కూడా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తలపడతాడు అనేది టాక్. మొత్తంగా విడుదలకు ముందే ఈ మూవీ నుండి లీక్ అవుతున్న విషయాలు అంచనాలు పెంచేస్తున్నాయి.
ఇటీవల విడుదలైన ట్రైలర్ సైతం భారీ ఆదరణ దక్కించుకుంది. రికార్డు స్థాయిలో లైగర్ ట్రైలర్ కి వ్యూస్ దక్కాయి. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక రోల్ చేశారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 25న లైగర్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది.