బాలయ్య - అనిల్ రావిపూడి మూవీపై క్రేజీ బజ్.. బాలయ్య సినిమాలో నటించనున్న లేడీ విలన్..

Published : Jul 03, 2022, 05:35 PM ISTUpdated : Jul 03, 2022, 05:37 PM IST
బాలయ్య - అనిల్ రావిపూడి మూవీపై క్రేజీ బజ్.. బాలయ్య సినిమాలో నటించనున్న లేడీ విలన్..

సారాంశం

నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ - టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ‘ఎన్బీకే108’ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే బాలయ్య విలన్ గా లేడీ విలన్ కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది.  

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇటీవల కరోనా బారిన పడి ప్రస్తుతం నివారణ చికిత్స పొందుతున్నారు. క్వారంటైన్ లో ఉన్న ఆయన కాస్తా షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. అయితే ఆరు పదుల వయస్సులోనూ బాలకృష్ణ బ్లాక్ బాస్టర్ సినిమాలతో ప్రేక్షకులను, తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల 
‘అఖండ’ మూవీతో బాలకృష్ణ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో విషయం తెలిసిందే. వయస్సు పెరుగుతున్నా కొద్దీ సినిమాల్లో మరింత జోష్ కనబర్చుస్తున్నారు బాలయ్య. అందుకే ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా బాలయ్య సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

అయితే  ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్నారు. అఖండ తర్వాత రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘ఎన్బీకే107’అనే వర్క్ టైటిల్ లో షూటింగ్ కొనసాగుతోంది. గోపీచంద్ మలినేని బాలయ్య చిత్రాన్ని మరింత ప్రత్యేక శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారు. ఇఫ్పటికే శరవేగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్స్ అందుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..  బాలయ్య - అనిల్ రావిపూడి చిత్రంలో విలన్ గా తమిళ నటి, లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ నటించనున్నట్టు గట్టి టాక్ వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ ఫీలవుతున్నారు. స

ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘క్రాక్’లో  రవితేజకు లేడీ విలన్ గా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా బాలయ్య - అనిల్ రావిపూడి సినిమాలో లేడీ విలన్ గా ఎంపికైనట్టు సమాచారం. ఇదే గనుక నిజమైతే.. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్, బాలయ్య మధ్య సాగే సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. వరలక్ష్మి గతంలో తెనాలి రామక్రిష్ణ బీఏ బీఎల్, క్రాక్, నాంది చిత్రాల్లో నటిస్తోంది. 

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ 107 చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 108లో విలన్ నటిస్తుందనే వార్తలు వినిపిస్తుండటంతో అభిమానులు కాస్తా ఎగ్జైట్ ఫీలవుతున్నారు. అనిల్ రావిపూడి ఇప్పటికే  ఎన్బీకే108 చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకాచకా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆగస్టు నుండి మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. 2023 సమ్మర్ లో చిత్రాన్ని రిలీజ్ చేసేలా షెడ్యూల్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?