కౌశల్ కెరీర్ గ్రాఫ్ మారబోతుందా..?

By Udayavani DhuliFirst Published 10, Sep 2018, 3:47 PM IST
Highlights

ఎన్నో ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంటూ ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆ తరువాత సీరియళ్లకు షిఫ్ట్ అయ్యాడు. అయితే కౌశల్ అనే పేరు మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు

ఎన్నో ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంటూ ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆ తరువాత సీరియళ్లకు షిఫ్ట్ అయ్యాడు. అయితే కౌశల్ అనే పేరు మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎప్పుడైతే అతడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారో.. అప్పటినుండి అతడి క్రేజ్ బాగా పెరిగిపోయింది.

నిజానికి షో మొదలైన రెండో వారంలోనే అతడు హౌస్ నుండి వెళ్లిపోవాల్సింది కానీ నూతన్ నాయుడు బయటకి వెళ్లిపోయాడు. కిరీటి చేసిన ఓ పని కారణంగా కౌశల్ కి ప్రేక్షకుల్లో ఆదరణ పెరిగింది. కేవలం షో కోసమే ఇక్కడికి వచ్చానని, ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోవడానికి కాదంటూ తన లక్ష్యాన్ని చెబుతూనే ఉన్నాడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, అతడి సహనం, ఆత్మ విశ్వాసం ఇలా తనకున్న లక్షణాలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు.

అతడికి టైటిల్ వస్తుందా..? రాదా..? అనే విషయాన్ని పక్కన పెడితే ఈ షోలో ఏ కంటెస్టెంట్ కి అంతెందుకు షో హోస్ట్ చేస్తోన్న నానికి కూడా రానంత క్రేజ్ కౌశల్ కి వచ్చింది. దీంతో అతడు కెరీర్ గ్రాఫ్ మారే అవకాశాలు చాలానే ఉన్నాయి. చాలా మంది నిర్మాతలు కౌశల్ తో సినిమా చేయడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు.. 

బిగ్ బాస్2: కౌశల్ కి టైటిల్ రాకపోతే..?

బిగ్ బాస్2: శ్యామల అవుట్.. టాప్ త్రీలో ఆ ముగ్గురే!

Last Updated 19, Sep 2018, 9:22 AM IST