మీరా మిథున్‌కి కోర్ట్ లో చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరణ

Published : Aug 24, 2021, 02:49 PM IST
మీరా మిథున్‌కి కోర్ట్ లో చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరణ

సారాంశం

దళిత సినిమా మేకర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడల్‌, నటి మీరా మిథున్‌ ప్రస్తుతం జైల్లో మగ్గుతుంది. తాజాగా ఆమె పెట్టుకున్న బెయిల్‌ పిటీషన్‌ని కోర్ట్ కొట్టేసింది.

నటి మీరా మిథున్‌కి కోర్ట్ లో చుక్కెదురైంది. ఆమెకి బెయిల్‌ ఇచ్చేందుకు చెన్నై ప్రిన్సిపల్‌ సెషన్స్ కోర్ట్ నిరాకరించింది. ఆమెతోపాటు, స్నేహితుడు అభిషేక్‌ కూడా దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ని కోర్ట్ సోమవారం కొట్టేసింది. ఇటీవల ఆమె యూట్యూబ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దళితులను చిత్ర పరిశ్రమ నుంచి తరిమికొట్టాలంటూ పిలుపినిచ్చింది. దళిత దర్శకులు తీస్తున్న సినిమాల వల్ల చిత్ర పరిశ్రమ విలువ తగ్గిపోతుందంటూ వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. సర్వత్రా విమర్శలు వచ్చాయి. 

ఆమె వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న వీసీకే పార్టీ నేత వన్నియరసు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేయడంతో మీరా మిథున్‌ కేరళకు పారిపోయింది. ఆమె కోసం అన్వేషణ చేపట్టిన పోలీస్‌ బృందం.. ఆచూకీని తెలుసుకుని స్పెషల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేరళకు వెళ్ళి ఆమెను అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు.

ప్రస్తుతం జైల్లో ఉన్న మీరా మిథున్‌... బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా దానిపై గత వారమే విచారణ జరిపిన కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ మరోమారు విచారణకు రాగా మీరా మిథున్‌తో పాటు ఆమె స్నేహితుడు అభిషేక్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో మరికొన్ని రోజులు జైల్లోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Duvvada Srinivas: చీరలమ్మి 7 నెలల్లో 12 కోట్లు సంపాదించా, సక్సెస్ అంటే ఇది
Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?