ఐకాన్‌ స్టార్‌తో మరోసారి బుట్టబొమ్మ.. హ్యాట్రిక్‌ కొట్టేందుకు గట్టి ప్లాన్‌.. ?

Published : Aug 24, 2021, 02:15 PM IST
ఐకాన్‌ స్టార్‌తో మరోసారి బుట్టబొమ్మ.. హ్యాట్రిక్‌ కొట్టేందుకు గట్టి ప్లాన్‌.. ?

సారాంశం

దిల్‌రాజు నిర్మించిన `డీజే`లోనూ తనే హీరోయిన్‌ కావడంతో, బన్నీ, పూజాల జోడీకి మంచి క్రేజ్‌ ఉన్న నేపథ్యంలో వీరిద్దరి మరోసారి తెరపై చూపించాలని పట్టుబడుతున్నాడట దిల్‌రాజు. `ఐకాన్` ప్రకటించి చాలా నెలలైన నేపథ్యంలో గతంలోనే హీరోయిన్‌ పాత్రకు పూజా హెగ్డే పేరును చిత్రబృందం పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి.

ఐకాన్‌ స్టార్‌తో బుట్టబొమ్మ మరోసారి రొమాన్స్ చేయబోతుంది. వీరిద్దరు కలిసి మరో సినిమా చేయబోతున్నారు. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే ఇప్పటికే `డీజేః దువ్వాడ జగన్నాథమ్‌`, `అల వైకుంఠపురములో` చిత్రాల్లో నటించారు. `డీజే` యావరేజ్‌గా నిలవగా, `అల వైకుంఠపురములో` చిత్రం సంచలన విజయం సాధించింది. నాన్‌ `బాహుబలి` రికార్డ్ లను తిరగరాసింది. 

ఈ నేపథ్యంలో ఈ క్రేజీ జోడి మరోసారి సిల్వర్‌ స్క్రీన్‌పై మ్యాజిక్‌ చేయబోతుందట. త్వరలోనే వీరిద్దరిని తెరపై చూడబోతామని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో అల్ల అర్జున్‌ `ఐకాన్‌` పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేనే అనుకుంటున్నారట. దిల్‌రాజు నిర్మించిన `డీజే`లోనూ తనే హీరోయిన్‌ కావడంతో, బన్నీ, పూజాల జోడీకి మంచి క్రేజ్‌ ఉన్న నేపథ్యంలో వీరిద్దరి మరోసారి తెరపై చూపించాలని పట్టుబడుతున్నాడట దిల్‌రాజు.

`ఐకాన్` ప్రకటించి చాలా నెలలైన నేపథ్యంలో గతంలోనే హీరోయిన్‌ పాత్రకు పూజా హెగ్డే పేరును చిత్రబృందం పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హీరోయిన్ల జాబి తాలోకి వేరే తారల పేర్లు వచ్చినప్పటికీ పూజానే ముందు వరుసలో ఉన్నారట. మరి మూడోసారి ఈ జంట మ్యాజిక్‌ చేస్తుందేమో చూడాలి. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న `పుష్ప` రెండు భాగాలుగా రాబోతుంది. తొలి భాగం క్రిస్మస్‌ కానుకగా రానుంది. అలాగే పూజా ప్రస్తుతం `రాధేశ్యామ్‌`, `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`, మహేష్‌-త్రివిక్రమ్‌ చిత్రం, `బీస్ట్` చిత్రంలో నటిస్తుంది.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు
Sobhan babu జీవితాన్ని ఒక్క సినిమాతో నిలబెట్టిన ఎన్టీఆర్, ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?