సలార్ విడుదలకు కి కౌంట్ డౌన్ స్టార్! 

Published : Jun 20, 2023, 06:48 PM IST
సలార్ విడుదలకు కి కౌంట్ డౌన్ స్టార్! 

సారాంశం

ఆదిపురుష్ చిత్ర సందడి ముగియక ముందే సలార్ మేనియా మొదలవుతుంది. అప్పుడే సలార్ విడుదల కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.   

వివాదాల నడుమ ఆదిపురుష్ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది. ఆదిపురుష్ వరల్డ్ వైడ్ నాలుగు వందల కోట్ల మార్క్ దాటినట్లు సమాచారం. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ రామాయణ గాథలో ప్రభాస్ రాఘవుడు పాత్ర చేశాడు. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. ఇక జానకి పాత్రలో కృతి సనన్ మెరిసింది. ఆదిపురుష్ మొదటి షో నుండి మిశ్రమ స్పందన దక్కించుకుంది. విజువల్స్ , గెటప్స్, కొని సన్నివేశాలు, డైలాగ్స్ పై అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. 

ఆదిపురుష్ పై విమర్శల నేపథ్యంలో సలార్ మూవీతో సమాధానం చెబుతామని ప్రభాస్ ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ అసలైన స్టామినా ఏమిటో సలార్ నిరూపిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. మరో వంద రోజుల్లో సలార్ విడుదల అంటూ పోస్టర్ విడుదల చేశారు. సోషల్ మీడియా ట్రెండ్ చేస్తున్నారు. 

సలార్ వరల్డ్ ఐదు భాషల్లో సెప్టెంబర్ 28న విడుదల కానుంది. అంటే విడుదలకు మరో వంద రోజుల సమయం మాత్రమే ఉంది. సలార్ విడుదల ఆలస్యం కానుందని ఆ మధ్య పుకార్లు లేచాయి. ఈ వార్తలను చిత్ర యూనిట్ ఖండించారు. సలార్ చెప్పిన ప్రకారం విడుదల అవుతుందని స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. కెజిఎఫ్ నిర్మాతలు సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sreenivasan: నటుడు శ్రీనివాసన్ ని ఆరాధించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఏకంగా తన పాత్రకి డబ్బింగ్‌
కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్