"ఆదిపురుష్"కు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్,ఎగతాళి చేస్తున్నారంటూ...

Published : Jun 20, 2023, 06:00 PM IST
  "ఆదిపురుష్"కు వ్యతిరేకంగా హైకోర్టులో  పిల్,ఎగతాళి చేస్తున్నారంటూ...

సారాంశం

సినిమాలో ప్రధాన పాత్రలను చూపించిన తీరు సరికాదన్న హిందూసేన.. రామాయణంలోని పాత్రలకు, ఆదిపురుష్ లోని పాత్రలకు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న శుక్రవారం రోజు (జూన్ 16న) విడుదలైన సంగతి తెలిసిందే.   ప్రభాస్ రాముడిగా రామాయణ కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు…కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ఈ సినిమాలో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీకి  ఆల్రెడీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.. సోషల్ మీడియాలో ఈ సినిమా పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కలెక్షన్స్ మాత్రం మాగ్జిమం డ్రాప్ కాకుండా దూసుకుపోతుంది.

 అయితే ఈ మూవీ లో పాత్రలు,సన్నివేశాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో  'ఆదిపురుష్'కు వ్యతిరేకంగా హిందూసేన ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ చిత్రం హిందువుల మనోభావాలు తీసేలా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. శ్రీరాముడిని, హిందూ సంప్రదాయాల్ని ఎగతాళి చేసేలా ఉందని ఆరోపించారు. సినిమాలో ప్రధాన పాత్రలను చూపించిన తీరు సరికాదన్న హిందూసేన.. రామాయణంలోని పాత్రలకు, ఆదిపురుష్ లోని పాత్రలకు ఏ మాత్రం పోలిక లేదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో రాముడు, సీత, రావణుడు, హనుమంతుడికి సంబంధించిన కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని, లేదా వాటిని సరిదిద్ది నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయాలని హిందూసేన పిటిషన్ లో పేర్కొంది.  

ఇక ఈ మూవీపై మార్నింగ్ షో నుంచే విపరీతమైన నెగెటివిటీ వస్తోంది. సినిమా లో రావణుడి గెటప్, హనుమాన్ డైలాగులు వంటివి జనాలకు షాక్ ఇచ్చాయి. రామాయణాన్ని వక్రీకరించారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఈ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించారని ఎంపీ ఈ సందర్భంగా ఆరోపించారు. అందుకు గానూ దేశ ప్రజలకు చిత్ర టీమ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇక ఎవరు ఏమన్నా సినిమా కలెక్షన్స్ మాత్రం భారీగా ఉన్నాయి. ముఖ్యంగా  ఆదిపురుష్ హిందీ వెర్షన్ ...తొలిరోజు 36.5 కోట్లతో బంపర్ ఓపినింగ్స్ తెచ్చుకుంది. కోవిడ్ తర్వాత హిందీ సినిమాల్లో   అత్యథిక ఓపినింగ్స్ తెచ్చుకున్న మూడవ చిత్రంగా నిలిచింది.నార్త్ ఇండియాను ఈ సినిమా టార్గెట్ చేయటం, నిర్మాత, దర్శకుడు, హీరోయిన్ తో సహా మాగ్జిమం ఆర్టిస్ట్ లు హిందీ వారు కావటం అక్కడ వారికి నచ్చుతోందని సమాచారం. 
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sreenivasan: నటుడు శ్రీనివాసన్ ని ఆరాధించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఏకంగా తన పాత్రకి డబ్బింగ్‌
కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్