రామ్‌ గోపాల్‌ వర్మ కంపెనీలో కరోనా కలకలం!

By Surya PrakashFirst Published Jul 3, 2020, 4:55 PM IST
Highlights

లాక్ డౌన్ టైమ్ ని వృధాపోనివ్వకండా కరోనా వైరస్,  నగ్నం అనే సినిమాలు తీసి రిలీజ్ చేసారు. ఇంకా నాలుగైదు ప్రాజెక్టులు వరసలో ఉన్నాయని వినికిడి. అయితే ఇప్పుడు టీమ్ లో ఒకరికి కరోనా వచ్చినట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయమై వెబ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే అందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. 

కరోనాపై నాకేంటి అంటూ ఓ హారర్ టైప్ సినిమాని అదే టైటిల్ తో తీసిన ఘనత రామ్ గోపాల్ వర్మది. ఆయన లాక్ డౌన్ టైమ్ లో అందరూ సైలెంట్ గా ఉంటే తను మాత్రం వరస పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఆయన ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఆయన లాక్ డౌన్ టైమ్ ని వృధాపోనివ్వకండా కరోనా వైరస్,  నగ్నం అనే సినిమాలు తీసి రిలీజ్ చేసారు. ఇంకా నాలుగైదు ప్రాజెక్టులు వరసలో ఉన్నాయని వినికిడి. అయితే ఇప్పుడు టీమ్ లో ఒకరికి కరోనా వచ్చినట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయమై వెబ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే అందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. 

మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు..రామ్ గోపాల్ వర్మ యాక్షన్ టీమ్ లో ఓ కీల‌క‌మైన స‌భ్యుడికి క‌రోనా సోకిన‌ట్టు చెప్తున్నారు. దాంతో వ‌ర్మ టీమ్ అలెర్ట్ అయిపోయి... ఎక్క‌డ ప‌నులు అక్క‌డే ఆపేసిన‌ట్టు తెలుస్తోంది.  టీమ్ లోకి మిగిలిన స‌భ్యుల‌కూ క‌రోనా టెస్టులు చేయిస్తున్నార్ట‌. మరి  వ‌ర్మ టెస్టులు చేయించుకుంటాడో లేదో? అని కొందరు మీడియావారు రాస్తున్నారు. అయితే సినిమా వేరు, జీవితం వేరు. వర్మ ఈ వార్త నిజమే అయితే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటారు. తన సన్నిహితులందరికు చేయిస్తారు.

ఇక ప్ర‌స్తుతం వ‌ర్మ రెండు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. ఆ రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం తీస్తున్న‌వే. వాటి ప‌నుల‌న్నీ వ‌ర్మ ఇప్పుడు ప‌క్క‌న పెట్టిన‌ట్టు చెప్తున్నారు. తమ మిగతా టీమ్ కు కరోనా నెగిటివ్ వస్తే ప్రాజెక్టులుకు ముందుకు తీసుకెళ్తారంటున్నారు. ఇక ఈ విషయమై అధికారికంగా సమాచారం ఏమీ లేదు. అంతవరకూ దీన్ని మీడియాలలో ప్రచారం అవుతున్న గాసిప్ క్రిందే పరిగణించాల్సి ఉంటుంది.

click me!