కూతురితో కలిసి మొక్కలు నాటిన రేణూ దేశాయ్‌

Published : Jul 03, 2020, 04:02 PM ISTUpdated : Jul 03, 2020, 04:03 PM IST
కూతురితో కలిసి మొక్కలు నాటిన రేణూ దేశాయ్‌

సారాంశం

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్‌ ఉదయ భాను... నటుడు బ్రహ్మానందంతో పాటు రేణు దేశాయ్‌కు చాలెంజ్‌ విసిరారు. ఆ చాలెంజ్‌ను స్వీకరించి రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి మొక్కలు నాటారు.

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమానికి సెలబ్రిటీల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే టెలివిజన్‌ కళాకారులతో పాటు పలువురు సినీ తారలు ఈ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. తాజాగా నటి, రచయిత, రియాలిటీ షో న్యాయనిర్ణేత రేణు దేశాయ్‌ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్‌ ఉదయ భాను... నటుడు బ్రహ్మానందంతో పాటు రేణు దేశాయ్‌కు చాలెంజ్‌ విసిరారు. ఆ చాలెంజ్‌ను స్వీకరించి రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు తమకు తామే చాలెంజ్‌గా తీసుకొని మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు.

ఇప్పటికే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవిత తో పాటు మెగాస్టార్ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేష్ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సచిన్, వీవీఎస్‌ లక్ష్మణ్‌, గోపీ చంద్‌, ప్రభాస్‌, సుమ ఇలా ఎందరో సినీ, టెలివిజన్‌, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?