అరరే.. అన్ని సూర్య సినిమాలో చూపించినట్టే జరుగుతున్నాయే!

Published : May 28, 2020, 02:43 PM IST
అరరే.. అన్ని సూర్య సినిమాలో చూపించినట్టే జరుగుతున్నాయే!

సారాంశం

కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య సినిమాల్లో చూపించిన సంఘటనలే వరుసగా జరుగుతుండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. గతంలో ఎవరూ ఊహించని కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే అరుదైన విషయాలు ఇప్పుడు నిజ జీవితంలో కూడా జనాలకు తారసపడుతున్నాయి.

కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో ఊహించి చేసిన కొన్ని సన్నివేశాలు నిజ జీవితంలో తారసపడినప్పుడు అవాక్కవుతుంటాం. ప్రస్తుతం అలాంటి పరిణామాలే జరుగుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య సినిమాల్లో చూపించిన సంఘటనలే వరుసగా జరుగుతుండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. గతంలో ఎవరూ ఊహించని కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే అరుదైన విషయాలు ఇప్పుడు నిజ జీవితంలో కూడా జనాలకు తారసపడుతున్నాయి.

అలాంటిదే కరోనా వైరస్‌. సూర్య నటించిన సిక్స్త్‌ సెన్స్‌ సినిమాలో ఇలాంటి ఓ వైరస్‌ నే చూపించారు. చైన కుట్ర పూరీతంగా ఓ వ్యక్తి ద్వారా ఇండియాలోకి వైరస్‌ను పంపిస్తుంది. అది క్షణాల్లోనే విస్తరిస్తూ దేశ మొత్తన్ని గడగడలాడిస్తోంది. అదే తరహాలో చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. మందు లేని వైరస్ ఎప్పుడు ఎలా ఆగుతుందో తెలియక ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి.

తాజాగా మరో సూర్య సినిమాలోని సంఘటన కూడా ప్రజా జీవితంలో ఎదురైంది. ఇటీవల సూర్య హీరోగా రిలీజ్‌ అయిన సినిమా బందోబస్త్‌. ఈ సినిమాలో విలన్ ఓ పంట పొలాలని దక్కించుకోవడానికి ఆ పొలాల మీదకు మిడతల దండును వదిలిపెడతాడు. తాజాగా అదే తరహాలో పాకిస్తాన్‌ నుంచి ఓ మిడత దండులో ఇండియాలోని పంట పొలాల మీద దాడి చేస్తోంది. దీంతో వరుసగా సూర్య సినిమాల్లో చూపించిన సంఘటనలే నిజ జీవితంలో ఎదురవుతుండటంపై జనాలు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Allu Arjun ఎప్పుడు ఏడుస్తాడో తెలుసా? ఇంటి రహస్యాలు బయటపెట్టిన అల్లు అరవింద్‌
Kavalan Movie: రోజాని చూసి షాకైన విజయ్! ఆ ఒక్క విషయం నమ్మలేకపోయాడు.. ఫ్లాష్‌బ్యాక్ సీక్రెట్స్!