
ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ను సందర్భించిన నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా లాక్ డౌన్ తరువాత షూటింగ్ లు తిరిగి ప్రారంభించే విషయంలో ఇండస్ట్రీ పెద్దలు జరుపుతున్న చర్చలకు తనను ఎవరూ ఆహ్వనించలేదన్న బాలయ్య, తనను ఇండస్ట్రీ వర్గాలు అవమానించారన్నట్టుగా వ్యాఖ్యనించాడు.
అయితే ఈ వార్తలపై ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ స్పందించాడు. మా అసోషియేషన్‌లో ఎలాంటి విభేధాలు లేవన్న కళ్యాణ్ బాలకృష్ణ తనను ఎవరో అవమానించారు అన్నట్టుగా మాట్లాడం సరికాదన్నారు. అలా బాలయ్యను అవమానించే ఉద్దేశం ఇండస్ట్రీలో ఎవరికీ లేదని చెప్పాడు. అదే సమయంలో చిరంజీవిని నాయకత్వం వహించాల్సిందిగా తామే కోరామని చెప్పాడు సీ కళ్యాణ్. అంతేకాదు నాయకుడు ఎవరన్నది కాదు.. మాకు పని జరగటం ముఖ్యంగా అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
ప్రతీ ఒక్కరిని ప్రత్యేకంగా ఆహ్వనించటానికి ఇది ఆర్టిస్ట్ ల మీటింగ్ కాదన్న కళ్యాణ్ బాలయ్య వస్తా అంటే ఎవరు కాదంటారు అంటూ వ్యాఖ్యనించాడు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్లను వారు పిలుస్తున్నారన్నట్టుగా వ్యాఖ్యనించటం కూడా కరెక్ట్ కాదన్నారు కళ్యాణ్. 60 రోజులుగా లాక్ డౌన్ కారణంగా స్థంబించిన పోయిన ఇండస్ట్రీని తిరిగి గాడిలో పెట్టేందుకు సినీ పెద్దలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు, చిరంజీవి ముందుండి ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నాడు.