కొత్త కరోనా...మళ్లీ ఈ సినిమాలకే దెబ్బ పడిందిగా

By Surya PrakashFirst Published Dec 22, 2020, 5:05 PM IST
Highlights

బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త  స్ట్రెయిన్ శరవేగంగా విస్తరిస్తుండడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ విమానాల ద్వారా వచ్చే ప్రయాణికుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే, వారంతా తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని కోరింది. 

అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ అంటే ఇతర దేశాలు హడలిపోతున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడమే అందుకు కారణం. భారత్ సహా అనేక దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధం విధించాయి. డిసెంబర్ 31 దాకా అదే పరిస్దితి కొనసాగనుంది. మరో ప్రక్క యూరప్ లోనూ కరోనా ఓ రేంజిలో విజృంభిస్తోంది. అమెరికాలోనూ అదే పరిస్దితి. వాక్సిన్ వచ్చేసిందన్న ఉత్సాహం ఎంతోసేపు నిలలబడటం లేదు. అయితే వీటిన్నటి ప్రభావం మిగతా రంగాలపై ఎలా ఉన్నా సినిమా పరిశ్రమపై ఖచ్చితంగా పడనుంది. దాంతో సినిమా వాళ్లు మళ్లీ డీలా పడుతున్నారు.

ముఖ్యంగా ఈ ప్రభావం..మహేష్ బాబు “సర్కారు వారి పాట”, పూరి జగన్నాథ్ “ఫైటర్” సినిమాలు పై పడనుంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలు అమెరికాలో షూటింగ్ జరుపుకోవాలి. వాటి షెడ్యూల్స్ మళ్ళీ వాయిదా పడటం ఖాయం. అలాగే, రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న “ఆర్.ఆర్.ఆర్” సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ యూరోప్ లో తీద్దామనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చాల్సిన పరిస్దితి. 

బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త  స్ట్రెయిన్ శరవేగంగా విస్తరిస్తుండడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ విమానాల ద్వారా వచ్చే ప్రయాణికుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే, వారంతా తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని కోరింది. పాజిటివ్‌గా తేలిన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు పంపాలని, నెగటివ్ వచ్చిన వారిని ఇంటికి పంపించి వైద్య సిబ్బందితో పర్యవేక్షించాలని సూచించింది.

click me!