బిగ్‌బాస్‌ తర్వాత ఫస్ట్ టైమ్‌ బయటికొచ్చిన విన్నర్‌ అభిజీత్‌..సోహైల్‌, హారికలను నామినేట్‌

Published : Dec 22, 2020, 05:01 PM ISTUpdated : Dec 22, 2020, 11:11 PM IST
బిగ్‌బాస్‌ తర్వాత ఫస్ట్ టైమ్‌ బయటికొచ్చిన విన్నర్‌ అభిజీత్‌..సోహైల్‌, హారికలను నామినేట్‌

సారాంశం

రెండు రోజుల క్రితమే ఆయన బిగ్‌బాస్‌ 4 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మొక్కలు నాటి తన బాధ్యతని చాటుకున్నారు. 

బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ అభిజిత్‌ తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితమే ఆయన బిగ్‌బాస్‌ 4 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మొక్కలు నాటి తన బాధ్యతని చాటుకున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా అభిజిత్‌ మాట్లాడుతూ, `బిగ్‌బాస్‌4 విన్నర్‌గా నిలిచిన తర్వాత ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి ఈ రోజు మొక్కలు నాటాను. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఆయన ధన్యవాదాలు. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని మనందరం నియంత్రించడం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి` అని అన్నారు. 

ఈ సందర్భంగా అభిజిత్‌.. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన్న సోహైల్‌, హారిక, కళ్యాణిలను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సీ శ్రీనివాస్‌రెడ్డి, రాఘవ, కిషోర్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి