ఇదిలా ఉంటే చిరంజీవి మరో సినిమాని ప్రారంభించారు. మలయాళ హిట్ సినిమా `లూసీఫర్` రీమేక్‌ని జనవరిలోనే ప్రారంభించారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ని ప్రారంభించాల్సి ఉంది. ఇది కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమా మే 13న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే చిరంజీవి మరో సినిమాని ప్రారంభించారు. మలయాళ హిట్ సినిమా `లూసీఫర్` రీమేక్‌ని జనవరిలోనే ప్రారంభించారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ని ప్రారంభించాల్సి ఉంది. ఇది కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉంటే మోహన్‌రాజా దర్శకత్వం వహించే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం అన్వేషణ కొనసాగుతుంది. బాలీవుడ్ దర్శక, నిర్మాత అనురాగ్ కశ్యప్‌ని విలన్ పాత్ర కోసం సంప్రదించారట యూనిట్. అత్యంత పవర్ ఫుల్ విలన్ అయితేనే సెట్ అవుతుందని భావించారు యూనిట్. కానీ ఆయన ఇందులో నటించేందుకు నో చెప్పారట. చిరంజీవి చిత్రంలో విలన్‌గా నటించలేనని తేల్చి చెప్పారట. అయితే ఆయన నో చెప్పడానికి గల కారణాలు మాత్రం సస్పెన్స్ గానే ఉన్నాయి. కానీ ఇప్పుడీ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
అనురాగ్ కశ్యప్ నో చెప్పడంతో విలన్ పాత్ర కోసం మరొకరిని వెతికే పనిలో బిజీగా ఉన్నారట. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేశారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. దీనికి `బైరెడ్డి` అనే టైటిల్ వినిపిస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత విడుదల చేయాలని భావిస్తున్నారు.