కరోనా ఎఫెక్ట్...  సర్కారు వారి పాట గోవా షెడ్యూల్ కి బ్రేక్

Published : Apr 04, 2021, 02:20 PM IST
కరోనా ఎఫెక్ట్...  సర్కారు వారి పాట గోవా షెడ్యూల్ కి బ్రేక్

సారాంశం

కరోనా వైరస్ సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేక్ వేసినట్లు సమాచారం అందుతుంది. షెడ్యూల్ ప్రకారం సర్కారు వారి పాట నెక్స్ట్  షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారట. అయితే గోవాలో షూట్ చేయాలన్న ఆలోచన చిత్ర బృందం విరమించుకున్నట్లు తెలుస్తుంది.   

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమపై కోవిడ్ ప్రభావం మరలా మొదలవుతున్నట్లు అనిపిస్తుంది. కోవిడ్ కారణంగా కొన్ని చిత్రాల షూటింగ్స్ కి బ్రేక్ పడుతుంది. తాజాగా కరోనా వైరస్ సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేక్ వేసినట్లు సమాచారం అందుతుంది. షెడ్యూల్ ప్రకారం సర్కారు వారి పాట నెక్స్ట్  షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారట. అయితే గోవాలో షూట్ చేయాలన్న ఆలోచన చిత్ర బృందం విరమించుకున్నట్లు తెలుస్తుంది. 


కరోనా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు గోవాలో చిత్రీకరణ నిర్వహించడం సరికాదని నిర్ణయించుకున్నారట.  దీనితో ఏప్రిల్ 15నుండి హైదరాబాద్ లోనే సర్కారు వారి పాట షూటింగ్ జరపనున్నారట. ఇక సర్కారు వారి పాట మూవీ హైదరాబాద్ షెడ్యూల్ 25రోజులు నిరవధికంగా కొనసాగుతుందని సమాచారం. 

దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో మహేష్ బాబు రోల్ సరికొత్తగా ఉండనుంది. సర్కారు వారి పాట మహేష్ ప్రీ లుక్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 2022లో  విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక సర్కారు వారి పాట చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

విజయ్‌, అజిత్‌ మధ్య మళ్లీ బాక్సాఫీసు వార్‌... ఫిబ్రవరి 20న థియేటర్, ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే!
ఎన్టీఆర్‌ ముందే మోహన్‌బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌.. ఏఎన్నార్‌, రామారావుతోపాటు అంతా షాక్‌