టాలీవుడ్ దర్శకుల ఆశలపై నీళ్లు చల్లుతున్న ప్రభాస్..!

Published : Apr 04, 2021, 10:52 AM IST
టాలీవుడ్ దర్శకుల ఆశలపై నీళ్లు చల్లుతున్న ప్రభాస్..!

సారాంశం

 ప్రభాస్ చేస్తున్న నాలుగు చిత్రాలలో ఇద్దరు దర్శకులు ఇతర పరిశ్రమలకు చెందినవారు కావడం గమనార్హం. అలాగే ప్రభాస్ తరువాత చిత్రాలు కూడా ఇతర పరిశ్రమల దర్శకులతోనే ఉండే అవకాశం కలదని వార్తలు వస్తున్నాయి.   


ఇప్పుడు ప్రభాస్ రేంజ్ వేరు.. ఆయన ఓ పాన్ ఇండియా స్టార్. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి బడా స్టార్స్ కూడా చేయలేని భారీ బడ్జెట్ చిత్రాలు ఆయన చేస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ మార్కెట్ దేశవ్యాప్తం కాగా, ఐదువందల కోట్ల రూపాయల వసూళ్లు అంటే... అవలీలగా లాగేస్తున్నాడు. బాహుబలి సిరీస్ తో రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ప్రభాస్, మిక్స్డ్ టాక్ దక్కించుకున్న సాహో చిత్రంతో నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు. 

హిందీలో సాహో లాభాలు రాబట్టి, హిట్ వెంచర్ గా నిలిచింది. దీనితో ప్రభాస్ తో మూవీ అంటే దాని బడ్జెట్ కనీసం నాలుగు వందల కోట్లు ఉండాలి. అసలు ప్రభాస్ రెమ్యూనరేషనే వంద కోట్లని ప్రచారం సాగుతుంది. మరి ఈ రేంజ్ లో ప్రభాస్ ఇమేజ్ ఉండగా, ఆయన ఇంకా లోకల్ డైరెక్టర్స్ మాట ఏమి వింటారు. నిజంగా పరిస్థితి అలాగే ఉంది. ప్రస్తుతం ప్రభాస్ కమిటైన నాలుగు చిత్రాలలో రాధే శ్యామ్ ని రాధా కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. మరో చిత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేయాల్సి ఉంది. 


మిగతా రెండు చిత్రాలు సలార్, ఆదిపురుష్ చిత్రాల దర్శకులలో ఒకరు బాలీవుడ్ కి చెందిన ఓం రౌత్ కాగా, మరొకరు కన్నడ పరిశ్రమకు చెందిన ప్రశాంత్ నీల్. చేస్తున్న నాలుగు చిత్రాలలో ఇద్దరు దర్శకులు ఇతర పరిశ్రమలకు చెందినవారు కావడం గమనార్హం. అలాగే ప్రభాస్ తరువాత చిత్రాలు కూడా ఇతర పరిశ్రమల దర్శకులతోనే ఉండే అవకాశం కలదని వార్తలు వస్తున్నాయి. 


మైత్రి మూవీ మేకర్స్ తో ప్రభాస్ ఓ మూవీ చేయనుండగా.. దానికి కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తారని ఈ మధ్య ఓ వార్త చక్కర్లు కొట్టింది. తాజాగా విజయ్ హీరోగా మాస్టర్ తెరకెక్కించిన కోలీవుడ్ యంగ్ డైరెక్టర్.. లోకేష్ కనకరాజ్ తో ఆయన ఓ మూవీ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ విధంగా దేశంలోని వివిధ పరిశ్రమలకు చెందిన టాలెంటెడ్ దర్శకులకు అవకాశం ఇస్తూ... టాలీవుడ్ దర్శకులను ప్రభాస్ అసలు పట్టించుకోవడం లేదని టాక్. ప్రభాస్ తో మంచి మూవీ చేసి పాన్ ఇండియా దర్శకులుగా ఎదగాలనుకునే, మన దర్శకుల ఆశలపై ప్రభాస్ నీళ్లు చల్లుతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు