యాంకర్‌ అనసూయకి మరో బంపర్‌ ఆఫర్‌.. `ఖిలాడి`ని పట్టేసింది

Published : Feb 03, 2021, 01:43 PM IST
యాంకర్‌ అనసూయకి మరో బంపర్‌ ఆఫర్‌.. `ఖిలాడి`ని పట్టేసింది

సారాంశం

అనసూయ ఇప్పుడు సినిమాల్లో ఫుల్‌ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ`తోపాటు తమిళంలో విజయ్‌ సేతుపతి చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలోనూ కీలక పాత్ర కోసం ఎంపికైందని టాక్‌. ఇప్పుడు ఈ రవితేజ చిత్రంలోనూ ఛాన్స్‌ కొట్టేసింది.

`జబర్దస్త్` యాంకర్‌, హాట్‌ బ్యూటీ అనసూయ మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. మాస్‌ మహారాజా రవితేజతో కలిసి నటించే ఛాన్స్‌ ని కొట్టేసింది. `ఖిలాడి`ని పట్టేసింది. రవితేజ హీరోగా రూపొందుతున్న `ఖిలాడి` చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం వెల్లడించింది. `వెల్‌కమ్‌ బ్యూటీఫుల్‌ నటి అనసూయ భరద్వాజ్‌ ఆన్‌ బోర్డ్. ప్లే స్మార్ట్, ఈ లేడీ గేమ్‌ ఛేంజర్‌` అని పేర్కొన్నారు. 

ఈ లెక్కన ఇందులో అనసూయ బలమైన పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తున్నట్టు, నిధి అగర్వాల్‌ మరో హీరోయిన్‌గా నటిస్తారని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ ఆకట్టుకుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏ స్టూడియో ఎల్‌ఎల్‌పీ, పెన్‌ మూవీస్‌ పతాకాలపై కోనేరు సత్యానారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇదిలా ఉంటే అనసూయ ఇప్పుడు సినిమాల్లో ఫుల్‌ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ`తోపాటు తమిళంలో విజయ్‌ సేతుపతి చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలోనూ కీలక పాత్ర కోసం ఎంపికైందని టాక్‌. ఇప్పుడు ఈ రవితేజ చిత్రంలోనూ ఛాన్స్‌ కొట్టేసింది. అలాగే మెయిన్‌ లీడ్‌గా `థ్యాంక్యూ బ్రదర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Vijay: ఎన్నికల ప్రచారానికి గంట ప్రయాణం..విజయ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?