మహేష్ బాబుని కలిసిన కాంగ్రెస్ జాతీయ నేత శశి థరూర్

pratap reddy   | Asianet News
Published : Sep 08, 2021, 07:24 PM ISTUpdated : Sep 08, 2021, 07:44 PM IST
మహేష్ బాబుని కలిసిన కాంగ్రెస్ జాతీయ నేత శశి థరూర్

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ మహేష్ లుక్, యాటిట్యూడ్ మెస్మరైజింగ్ గా ఉంది. 

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సర్కారు వారి పాట షూటింగ్ లొకేషన్ లో ఓ అనుకోని అతిథి ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత శశి థరూర్. శశి థరూర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్న పొలిటీషియన్. శశిథరూర్ ప్రస్తుతం తిరువనంతపురం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

హైదరాబాద్ లోని ఓ హోటల్ వద్ద సర్కారు వారి పాట షూటింగ్ జరుగుతోంది. అదే హోటల్ లో శశి థరూర్ ఉండడంతో ఆయన మహేష్ బాబుని, ఎంపీ గల్లా జయదేవ్ ని మీట్ అయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడం కోసం శశి థరూర్ హైదరాబాద్ వచ్చారు. 

మహేష్ ని మీట్ అయిన విషయాన్ని శశి థరూర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ ఫోటోస్ లో మహేష్ లుక్ ఆకట్టుకుంటోంది. చెవి పోగుతో మహేష్ మాస్ లుక్ లో అదరగొడుతున్నాడు. మహేష్, శశిథరూర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. 

 

PREV
click me!

Recommended Stories

నాగార్జున, కృష్ణ అభిమానుల మధ్య అతి పెద్ద వార్... ఎప్పుడు జరిగిందో తెలసా? కారణం ఏంటి ?
Viral Video: స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్‌తో మలైకా అరోరా డాన్స్.. కొత్త వీడియో వైరల్!