'టిల్లు స్క్వేర్' సెన్సార్ కంప్లీట్.. ఏదో అనుకుంటే ఈ ట్విస్ట్ ఏంటి..

By tirumala ANFirst Published Mar 22, 2024, 6:02 PM IST
Highlights

సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు చిత్రం రొమాంటిక్ అండ్ ఫన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 

సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు చిత్రం రొమాంటిక్ అండ్ ఫన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మార్చి 29న ఈ చిత్రం రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ మూవీలో సిద్ధుకి జోడిగా అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోంది. 

కెరీర్ లో ఎప్పుడూ లేనంత బోల్డ్ గా ఈ మూవీలో అనుపమ నటించింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో సిద్దు. అనుపమ రొమాన్స్ ఎక్కువగా హైలైట్ అయింది. లిప్ కిస్సులు లాంటివి కూడా ఉన్నాయి. దీనితో యువతలో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. 

is certified with 𝐔/𝐀 ❤️‍🔥

Tillanna is ready to BLAST the screens with DOUBLE the FUN & ENTERTAINMENT! 😎🤘

Worldwide grand release at theatres near you on MARCH 29th! 🥳 … pic.twitter.com/kQpuu0AlFI

— Sithara Entertainments (@SitharaEnts)

మరికొన్ని రోజుల్లోనే రిలీజ్ ఉండడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ఇచ్చిన సర్టిఫికెట్ మాత్రం ఊహించని ట్విస్ట్ అనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ .. అనుపమ, సిద్దు రొమాన్స్ హంగామా చూసి ఈ మూవీకి 'ఏ' సర్టిఫికెట్ ఖాయం అనుకున్నారు. కానీ సెన్సార్ సభ్యులు చక్కగా 'యు/ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు. 

ఇది ఊహించని పరిణామమే అని చెప్పొచ్చు. అంటే ఈ చిత్రంలో రొమాన్స్ హద్దుల్లోనే ఉన్నట్లు భావించాలి. మాలిక్ రామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

click me!