ఊపిరి తీసుకోవాలి అంటే భయమేస్తోంది.. రజినీకాంత్ కామెంట్స్ వైరల్..

Published : Mar 22, 2024, 05:58 PM IST
ఊపిరి తీసుకోవాలి అంటే భయమేస్తోంది.. రజినీకాంత్ కామెంట్స్ వైరల్..

సారాంశం

ఎన్నికల సమయంలో తనకు ఊపిరి తీసుకోవాలన్నా భయమేస్తోందని స్టార్ హీరో రజనీకాంత్ సరదా కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 


చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఒకటైన కావేరీ హాస్పిటల్ ఇప్పుడు వడపళనిలో కొత్త ప్రపంచ స్థాయి ఆసుపత్రిని నిర్మిస్తోంది. అత్యాధునిక చికిత్సా సౌకర్యాలతో ఆసుపత్రి ప్రారంభోత్సవం ఈరోజు అట్టహాసంగా జరిగింది. ప్రత్యేక అతిథిగా హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్ పలు విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆసుపత్రి ఉన్న స్థలం గురించి రజనీకాంత్ మాట్లాడుతూ.. గతంలో ఏవీఎం స్టూడియోలో సినిమా షూటింగ్‌లు జరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్యాచ్ వర్క్ చేసేవారన్నారు. నా సినిమాలు కూడా ఇక్కడే షూట్ చేశాం. అలాంటి పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం ఈ కావేరీ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు రజనీ తెలిపారు.

గతంలో కావేరీ ఆసుపత్రి ఎక్కడ అని ఎవరినైనా అడిగితే, కమల్‌ హాసన్ వాళ్ల ఇంటి దగ్గర అని చెప్పేవాళ్లు. ఇప్పుడు కమల్ హాసన్ వాళ్ల ఇల్లు కావేరీ ఆసుపత్రి దగ్గర అని చెబుతున్నారు. ఇది సాధారణంగా చెబుతున్నానంతే.. మళ్లీ నాకూ, కమల్‌కు విభేదాలున్నాయని రాయకండి. మీడియా వాళ్లు ఉంటే మాట్లాడాలంటే సంకోచిస్తున్నాను. ఈ కెమెరాలన్నీ చూస్తుంటే భయమేస్తోంది. 

అసలే ఎన్నికల సమయం. నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాను అని సరదా కామెంట్స్ చేశారు. గతంలో తాను అనేక ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నట్టు చెప్పిన రజనీ..వారి వల్లే తాను ఇప్పుడిలా హాయిగా ఉన్నట్టు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌