ఇప్పుడే విమర్శించడం కరెక్ట్ కాదు.. అభిమానుల ఆవేదన

First Published Jul 6, 2018, 6:19 PM IST
Highlights

 బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో బాలకృష్ణ తలపాగా కట్టుకొని, మీసకట్టుతో ఎన్టీఆర్ ను తలపిస్తున్నారు. అయితే ఈ ఫోటో ఇలా ఆన్ లైన్ లో ప్రత్యక్షమైందో లేదో వెంటనే విమర్శకులు ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో అంటూ విమర్శించడం మొదలుపెట్టారు. 

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో బాలకృష్ణ తలపాగా కట్టుకొని, మీసకట్టుతో ఎన్టీఆర్ ను తలపిస్తున్నారు.

అయితే ఈ ఫోటో ఇలా ఆన్ లైన్ లో ప్రత్యక్షమైందో లేదో వెంటనే విమర్శకులు ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో అంటూ విమర్శించడం మొదలుపెట్టారు. బ్లాక్ అండ్ వైట్ కాబట్టి మార్ఫింగ్ చేసినా పెద్దగా తెలియడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో క్రిష్ కలర్ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్ లో ఉంచారు. బాలయ్య.. ఎన్టీఆర్ పాత్రలో కనిపిస్తున్నాడని తెలియగానే అభిమానులు ఎంతగానో సంతోషపడ్డారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను ఫాలో అవుతున్నారు. వారిని ఈ మార్ఫింగ్ కామెంట్స్ ఒకింత నిరాశకు గురి చేశాయి.

వాస్తవికతను తెరపై చూపించడానికి ఇష్టపడే క్రిష్ లాంటి దర్శకులకు మార్ఫింగ్ చేయాల్సిన అవసరం లేదంటూ  కొందరు అభిమానులు తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. బయోపిక్ ఆరంభంలోనే ఇలా విమర్శించడం కరెక్ట్ కాదని అంటున్నారు. యూనిట్ సభ్యులు మాత్రం ఇది మార్ఫింగ్ చేసిన లుక్ కాదని నమ్మకంగా చెబుతున్నారు. ఇలా ఒక లుక్ తోనే సినిమాను డిసైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 

click me!