వ్యాక్సిన్ తీసుకున్న స్టార్ కమెడియన్ కి గుండెపోటు... కుష్బూ క్లారిటీ!

Published : Apr 16, 2021, 02:06 PM ISTUpdated : Apr 16, 2021, 02:23 PM IST
వ్యాక్సిన్ తీసుకున్న స్టార్ కమెడియన్ కి గుండెపోటు... కుష్బూ క్లారిటీ!

సారాంశం

ఏప్రిల్ 16 ఉదయం వివేక్ చిన్నపాటి గుండె నొప్పికి గురయ్యారు. దీనితో దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి ఆయనను తీసుకొని వెళ్లడం జరిగింది. హాస్పిటల్ బృందం తాజా సమాచారం ప్రకారం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

కోలీవుడ్ స్టార్ నటుడు వివేక్ గుండెపోటుకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటున్నారు. ఏప్రిల్ 16 ఉదయం వివేక్ చిన్నపాటి గుండె నొప్పికి గురయ్యారు. దీనితో దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి ఆయనను తీసుకొని వెళ్లడం జరిగింది. హాస్పిటల్ బృందం తాజా సమాచారం ప్రకారం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఓ ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తున్నారు. 

నిన్న వివేక్ కోవిడ్ వాక్సిన్ తీసుకున్నారు. అలాగే అందరూ కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని, ఆయన విజ్ఞప్తి చేశారు. వాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే ఆయన అనారోగ్యం పాలు కావడం చర్చనీయాంశం గా మారింది. నిన్న వాక్సిన్ తీసుకున్నట్లు వివేక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే వైద్యులకు, సిబ్బందికి వివేక్ ధన్యవాదాలు తెలిపారు. 


కాగా నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. వివేక్ అనారోగ్యంపాలు కావడానికి వాక్సిన్ తీసుకోవడమే అని కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. పుకార్లు నమ్మకుండా అందరూ వాక్సిన్ తీసుకోవాలని, తమని తాము రక్షించుకోవాలని ఆమె కోరారు. ఇక వివేక్ త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ప్రార్ధనలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ 'స్పిరిట్'లో మెగాస్టార్ చిరంజీవి ?.. ఎలాంటి పాత్రో తెలుసా, థియేటర్లు తగలబడిపోతాయి
డబ్బు కోసమే అల్లు అర్జున్ తో సినిమా, కార్తీని అందుకే వదిలేశాడా.. క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్