హాస్య నటుడు వేణుమాధవ్ ఇంట్లో విషాదం!

Published : Jun 29, 2019, 08:42 PM IST
హాస్య నటుడు వేణుమాధవ్ ఇంట్లో విషాదం!

సారాంశం

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం వేణుమాధవ్ సోదరుడు కార్తీక్ మృతి చెందారు.

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం వేణుమాధవ్ సోదరుడు కార్తీక్ మృతి చెందారు. కార్తీక్ గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ లోని హెచ్ బి కాలనిలో వేణుమాధవ్ నివాసం ఉంది. అతడి సోదరుడి మృతి గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు, స్నేహితులు వేణు మాధవ్ ఇంటికి వెళ్లి పరామర్శించి వస్తున్నారు. వేణు మాధవ్ సోదరుడి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

వేణు మాధవ్ ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా నటించి కడుపుబ్బా నవ్వించారు. ప్రస్తుతం వేణు మాధవ్ సినిమా అవకాశాలు రావడం లేదు. వేణు మాధవ్ అనారోగ్యానికి గురికావడం వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది. లక్ష్మీ, ఛత్రపతి, సై లాంటి చిత్రాల్లో వేణు మాధవ్ హాస్యాన్ని అద్భుతంగా పండించారు. 

PREV
click me!

Recommended Stories

కాసుల వర్షం కురిపిస్తున్న రాజా సాబ్, ప్రభాస్ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
కెమెరాల ముందు ప్రియాంక, నిక్ రొమాన్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో స్టార్ కపుల్ సందడి