
సినీ పరిశ్రమలో అందాలు పెంచుకోవటానికి సర్జరీలు చేయించుకోవటం సహజంగా జరిగే ప్రక్రియ. ముఖ్యంగా హీరోయిన్స్ ఈ విషయంలో ముందుంటారు. తమ కెరీర్ ని తీర్చిదిద్దుకునే పక్రియలో ఇదో భాగంగా భావిస్తారు. ఆక్రమంలోనే తన గ్లామర్ ను మరింత పెంచుకునే యోచనలో ఉప్పెన భామ ఉన్నట్టు ప్రచారం జరిగింది. తన అందానికి మరింత మెరుగులు దిద్దుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని చెప్తున్నారు. తన పెదవులు కొచెం వెడల్పుగా ఉంటాయని... అందువల్ల తన ముఖంలో కొంత అందం తగ్గిందని ఆమె భావించి,వాటి సైజ్ తగ్గించుకుందిట. ఈ విషయం మీడియంలో వైరల్ అయ్యింది. ఈ వార్తలకు తగ్గట్లుగానే ఆమె ఫొటోలలో తేడా కనపడుతోంది. దాంతో పాత ,కొత్త ఫొటోలు దగ్గర పెట్టి నిజమే అంటున్నారు.
అయితే అలాంటిదేమీ లేదంటోంది ఆమె టీమ్. ఆమె సహజమైన అందాలే తప్పించి ఎలాంటి సర్జరీలు జరగలేదంటున్నారు. ఆమెది అద్బుతమైన అందం అని, ఆమె నవ్వుకే ప్రత్యేక అభిమానులు ఉన్నారని,అలాంటప్పుడు సర్జీరిలకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అంటున్నారు. అలాగే టీనేజ్ లో ఉన్న ఆడపిల్లలలకు ఎదిగే వయస్సులో వచ్చే మార్పులే అని, అంతకు మించి ఏమీ లేదని రూమర్స్ గా ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు.
తెలుగులో ఇప్పుడున్న హీరోయిన్లలో అందరి కంటే లక్కీ కృతి శెట్టినే అని చెప్పుకోవాలి. తన తొలి చిత్రం 'ఉప్పెన'తోనే హిట్ అందుకున్న ఈ కన్నడ భామకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అవి డిజాస్టర్స్ అయ్యాయి. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో హిట్లు అందుకున్న ఆమె ఇటీవల ది వారియర్,కష్టడీ సినిమాతో పరాజయం అందుకుంది. అయినా సరే మరో పెద్ద స్టార్ హీరో సినిమా ఛాన్స్ కొట్టేసింది. యంగ్ స్టార్ హీరోలు సైతం ఆమె తమ సినిమాలో ఉండాలని కోరుకుంటున్నారు. తమిళ పరిశ్రమలో కూడా కృతికి మంచి ఫాలోయింగ్ ఉండటమే కలిసొస్తోంది.