
భోజ్ పురి డైరెక్టర్ సుభాష్ చంద్ర తివారి మరణం సంచలనంగా మారింది. ఓ చిత్ర షూటింగ్ కోసం ఉత్తరప్రదేశ్ వెళ్లిన ఆయన అనూహ్యంగా మరణించారు. సుభాష్ చంద్ర తివారి ఉత్తరప్రదేశ్ సోన్బద్రలో గల తిరుపతి అనే హోటల్ లో స్టే చేశారు. అదే హోటల్ లో తన టీం కూడా ఉన్నారు. సుభాష్ చంద్ర తివారి గది నుండి బయటకు రాలేదు. ఆయన నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి పోలీసులు లోపలి ప్రవేశించారు.
సుభాష్ చంద్ర తివారి లోపల విగతజీవిగా పడి ఉన్నారు. బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్ వస్తే గానీ సుభాష్ చంద్ర తివారి మృతికి కారణాలు తెలియవు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుభాష్ చంద్ర మృతిపై సన్నిహితులు, చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.
రోజుల వ్యవధిలో పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు మృతి చెందారు. పాపులర్ టెలివిజన్ యాక్టర్ నితేశ్ పాండే కార్డియాక్ అరెస్ట్ తో మరణించారు. వైభవి ఉపాధ్యాయ కారు ప్రమాదంలో మృతి చెందింది. అలాగే మరో నటుడు ఆదిత్య సింగ్ రాజ్ పుత్ అకాల మరణం పొందారు. వరుస మరణాలు పరిశ్రమను విషాదంలో నింపుతున్నాయి.