#GodFather: 'గాడ్ ఫాదర్' ఏ ఓటిటీలో స్ట్రీమ్ అవుతుందంటే...

By Surya PrakashFirst Published Sep 21, 2022, 10:00 AM IST
Highlights

సినిమా రిలీజైన యాభై రోజులు తర్వాత ఓటిటిలో రిలీజ్ చేస్తారు. ఫ్యాన్సీ రేటుకి ఈ హక్కులను అమ్మారు. ఎంత మొత్తమనేది బయటకు రాలేదుత్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది.


ప్రతీ పెద్ద సినిమాకు ఇప్పుడు ఓటిటి డీల్ అనేది మెయిన్ ఇనకమ్ సోర్స్ గా మారిపోయింది. క్రేజ్ ఉన్న ప్రాజెక్టుకు ఓటిటి డీల్స్ రిలీజ్ కు ముందే అవుతున్నాయి. చిరంజివి వంటి స్టార్స్ నటించిన సినిమాలు కొనుక్కోవటానికి ఓటిటి సంస్దలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో  చిరంజివి తాజా చిత్రం  'గాడ్ ఫాదర్'(God Father)ఓటిటి డీల్ ఫైనల్ అయ్యినట్లు సమాచారం. 

వివరాల్లోకి వెళితే... మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ వేగం పెంచేశారు. ఇటీవల సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ డీల్స్ ను క్లోజ్ చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఓటిటి డీల్ కూడా భారీ రేటుకు క్లోజ్ అయ్యింది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటిటి రైట్స్ నెట్ ప్లిక్స్ #Netflix వారు సొంతం చేసుకున్నారు. వారు సినిమా రిలీజైన యాభై రోజులు తర్వాత ఓటిటిలో రిలీజ్ చేస్తారు. ఫ్యాన్సీ రేటుకి ఈ హక్కులను అమ్మారు. ఎంత మొత్తమనేది బయటకు రాలేదుత్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది.
  
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు.  ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు. 

click me!