కౌశల్.. నీ బతుకెంత..? కమెడియన్ పృధ్వీ కామెంట్స్!

Published : Mar 07, 2019, 10:10 AM IST
కౌశల్.. నీ బతుకెంత..? కమెడియన్ పృధ్వీ కామెంట్స్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ పై ఇప్పుడు ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్ కి ఎదురుతిరగడంతో విషయం మరింత పెద్దదైంది. 

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ పై ఇప్పుడు ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్ కి ఎదురుతిరగడంతో విషయం మరింత పెద్దదైంది. తాజాగా కౌశల్ పై కమెడియన్ పృధ్వీ సంచలన కామెంట్స్ చేశారు.

అసలు వీడు(కౌశల్) ఎవడు..? వీడికంత సీన్ లేదు..? అంటూ ఫైర్ అయ్యారు పృధ్వీ. ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పృధ్వీ.. కౌశల్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కౌశల్ ఆర్మీనా..? అసలు ఎవడ్రా నువ్.. నీదో తొక్కలో ఆర్మీ.. అసలు ఆర్మీ అనే పదాన్ని వాడటం తప్పు అంటూ కామెంట్స్ చేశారు.

కౌశల్ అనేవాడి బతుకెంత..? వీడికి ఆర్మీనా..? ముందు వాడి పేరు నుండి ఆర్మీ అనే పదాన్ని తొలగించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కౌశల్ కి ఏం అర్హత ఉందని తనీష్, బాబు గోగినేనిల గురించి మాట్లాడాడు అంటూ ప్రశ్నించాడు.

కౌశల్ ఆర్మీ పండ్లు పంచింది, బ్లడ్ డొనేట్ చేసిందంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు.. అలాంటివి అందరూ చేస్తారని.. దానికంత పబ్లిసిటీ అవసరం లేదని అన్నారు. కౌశల్ దొంగనాటకానికి, అబద్దాలకు జనం ఓట్లు వేయడంతో పాటు డబ్బులు కూడా ఇచ్చారని కౌశల్ కి అంత సీన్ లేదని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్