షాక్ : నమ్రత తో అరవింద్ చర్చలు...అందుకు కాదట

Published : Mar 07, 2019, 09:33 AM IST
షాక్ : నమ్రత తో అరవింద్ చర్చలు...అందుకు కాదట

సారాంశం

నిన్నటి నుంచీ మీడియాలో హోరుమంటున్న విషయం అల్లు అరవింద్ ...నమ్రతను కలిసాకే ...బన్ని-సుకుమార్ ప్రాజెక్టు ప్రకటన వచ్చిందని.  సుకుమార్, అల్లు అర్జున్ కాంబో సినిమా ఎనౌన్స్ చేయగానే ఆరోజు సాయంత్రమే సుకుమార్ తో సినిమా చేయట్లేదని, క్రియేటివ్ డిఫరెన్స్ తో ప్రాజెక్టు వదలుకున్నాని ట్వీట్ చేసారు.

నిన్నటి నుంచీ మీడియాలో హోరుమంటున్న విషయం అల్లు అరవింద్ ...నమ్రతను కలిసాకే ...బన్ని-సుకుమార్ ప్రాజెక్టు ప్రకటన వచ్చిందని.  సుకుమార్, అల్లు అర్జున్ కాంబో సినిమా ఎనౌన్స్ చేయగానే ఆరోజు సాయంత్రమే సుకుమార్ తో సినిమా చేయట్లేదని, క్రియేటివ్ డిఫరెన్స్ తో ప్రాజెక్టు వదలుకున్నాని ట్వీట్ చేసారు. అయితే మహేష్ కు ఇలా కోపం వస్తుందని ముందే నమ్రతను కలిసి అల్లు అరవింద్ కూల్ చేసే ప్రయత్నం చేసారని చెప్పుకుంటున్నారు. 

నమ్రతను కలిసిన అల్లు అరవింద్... మహేష్ కు సుకుమార్ గతంలో చెప్పిన స్క్రిప్ట్ నచ్చలేదు. కాబట్టి అది తన కొడుకు బన్నీ తో  మైత్రి వాళ్లే ప్రొడ్యూసర్స్  గా సినిమా  చేసుకుంటామని, దానికి బదులుగా కావాలంటే గీతా ఆర్ట్స్ లో మహేష్ తో ఒక సినిమా చేస్తామని ప్రపోజల్ పెట్టారట.  అయితే నమ్రత కధ నచ్చక పోవడం ఏమీ లేదని తాము రెండు సినిమాలు(అనిల్, సుకుమార్) ఓకే సారి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారట.  అయినా సరే ఆ ప్రకటన వచ్చేసింది. దాంతో మహేష్ అలా ట్వీట్ చేసారని చెప్పుకుంటున్నారు. 

అయితే అవేమీ నిజం కాదని గీతా ఆర్ట్స్ కు సంభందించిన వాళ్లు  ఖండిస్తున్నారు. కేవలం నమ్రత ని కలిసిన కారణం మహేష్ తో ఓ స్క్రిప్టు డిస్కస్ చేసేందుకు అల్లు అరవింద్ కలిసారని, ఆయనకు నచ్చితే గీతా ఆర్ట్స్ పై సినిమా చేద్దామనే ఆలోచనే తప్ప సుకుమార్ తో చేయబోతున్న సినిమా గురించి డిస్కస్ చేయటానికి మాత్రం కాదు అంటున్నారు.  అయితే ఇందులో ఏది నిజం..ఏం జరిగింది మాత్రం ఎప్పటికి రహస్యమే. 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?